జిల్లాతోనే అభివృద్ధి
సిరిసిల్ల : జిల్లా అయితేనే సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ అన్నారు. న్యాయవాదుల దీక్ష శిబిరాన్ని శుక్రవారం సందర్శించి మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ముందుగా ప్రకటించిన సిరిసిల్లపై ప్రభుత్వం మాటమార్చిందన్నారు. సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జక్కుల యాదగిరి, నాయకులు గుండెటి శేఖర్, వంగరి అనిల్, కొత్వాల్ రవి, దీక్షల్లో న్యాయవాదులు కోడం సత్యనారాయణ, జె.ప్రభాకర్, టి.వెంకటి, నర్మెట రమేశ్, కె.ధర్మేందర్, కోడి లక్ష్మణ్, కళ్యాణ్ చక్రవర్తి, కుంట శ్రీనివాస్, అనిల్, టి.పర్శరాములు, సురభి సత్యనారాయణరావు, జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంత్రావు, బుస్సా వేణు, రాజేశం, కంసాల మల్లేశం, లింగంపల్లి సత్యనారాయణ, రొడ్డ రామచంద్రం, బీఎస్సీ నాయకులు మల్యాల రమేశ్, బట్టు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.