యూకీ బాంబ్రీ ఓటమి
కర్షి: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న కర్షి ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో అన్‌సీడేడ్, ప్రపంచ 273వ ర్యాంకర్ యూకీ 1–6, 4–6తో ప్రపంచ 225వ ర్యాంకర్, ఈగర్ గరాసిమోవ్ (బెలారస్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా మూడుసార్లు సర్వీస్ కోల్పోయిన భారత స్టార్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఈ సీజన్లో యూకీకిది మూడో సెమీస్ ఓటమి కావడం విశేషం. జుహయ్, షెంజాన్ టోర్నీలో యూకీ సెమీస్‌లోనే ఓడిన సంగతి తెలిసిందే.