లండన్‌లో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు
లండన్ :
నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఆదివారం ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించారు. లండన్‌లో తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో, ఆస్ట్రేలియాలోని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి మెల్బోర్న్లోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్ కేంద్రంలో సామూహిక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
అనంతరం కవిత పేరిట పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలో నాయకులు అనిల్‌రావు, రాజేశ్, మాదవ్, సత్యంరావు, అమర్‌రావు, సునిల్‌రెడ్డి, ప్రకాశ్, వెంకట్, ఉదయ్, డాక్టర్ అర్జున్, హేమంత్, రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.