కాశ్మీర్ వేర్పాటువాదులతో సర్తాజ్ అజీజ్ భేటీ
న్యూఢిల్లీ: కాశ్మీర్ వేర్పాటు వాద గ్రూపులతో పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఢిల్లీలో సమావేశం కావడంతో కొత్త వివాదానికి తెరలేచింది. ఆదివారం అజీజ్ ఇక్కడి పాక్ హైకమిషన్‌లో హురియత్ కాన్ఫరెన్స్ గ్రూపులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆసియా, యూరప్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి ఉదయం ఇక్కడికి వచ్చిన అజీజ్.. సాయంత్రం హురియత్ నేత సయ్యద్ అలీషా, జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్, మితవాద అవామీ గ్రూపు నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, దుక్తరనీ మిల్లట్ ఫౌండర్ అసియా అండ్రబీతో సమావేశమయ్యారు. అంతకుముందు దీనిని అడ్డుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ డిమాండ్ చేశారు. ఇలా భారత భూభాగంలో కాశ్మీర్ వేర్పాటు వాదులతో అజీజ్ సమావేశానికి యూపీఏ ప్రభుత్వం అనుమతించడం పట్ల ఆయన మండిపడ్డారు.