Kasturba Gandhi schools
-
వారికి వెంటనే ఉద్యోగాలివ్వాలి: ఆర్ కృష్ణయ్య
ఖైరతాబాద్(హైదరాబాద్): కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయ ముట్టడిలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2018లో పరీక్షలు రాసిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను 2020లో కరోనా కారణంగా అర్ధంతరంగా వాయిదా వేశారని తెలిపారు. కొన్ని జిల్లాల్లోనే అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైంది కాదని, గతంలో ఎంపికైన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి దృష్టిసారించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. -
పేదింటి నక్షత్రాలు
చింపిరి బట్టలు వేస్కొని ఎంత గట్టిగా ఎగిరినా.. చేతికి నక్షత్రాలు అందుతాయా?చింపిరి ఒంటికే గానీ ప్రతిభకు కాదు కదా!పేదింట్లో ఉండి, మట్టిలో మాణిక్యాలుగా మారి.. పైన తారకలే అసూయ పడేలా మెరుపులు మెరిసిన.. పదకొండు రాకెట్ల కథలివి! పేదరికం ఒక్కొక్కరికి ఒక్కోరకంగా పరీక్షలు పెడుతుంది. పెద్దవాళ్లు ఈ పరీక్షల్లో నిలబడితేనే పిల్లలు జీవితంలో నెగ్గేది. రెక్కాడితే గాని డొక్కాడని; కూలి, నాలి చేస్తే తప్ప జానెడు పొట్ట నిండని çపరిస్థితుల్లో పిల్లలను చదివించాలన్న ధ్యాస తల్లిదండ్రులకు ఉండదు. మరికొందరు పిల్లలకు చదువుకోవాలని ఉన్నా, వారికి చదివించే దిక్కు ఉండదు. కొందరికి తల్లి ఉంటే తండ్రి లేక, మరికొందరికి తల్లిదండ్రులు ఇద్దరూ లేక చదువుకోవాలన్న కోరిక తీరదు. ఇలాంటి కష్టాల మధ్యలో చదువు ఆపేసిన బాలికలను అక్కున చేర్చుకుంటోంది కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ). ఈ పాఠశాలల్లో చేరిన పేద, అనాధ బాలికలు ఆకాశమే హద్దుగా అంచలంచలుగా ఎదుగుతున్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదవాలన్న తపన ఉండాలే కాని ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదని నిరూపిస్తున్నారు. జీవితంలో ఇక చదవలేమనుకున్న స్థితి నుంచి తమ విద్యను కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరిలో కొందరు ఇటీవల ఏకంగా యు.ఎస్.లోని ‘నాసా’ను సందర్శించి వచ్చారు. ఆ పిల్లల ప్రతిభకు దక్కిన గుర్తింపు అది. ప్రతిభకు ప్రత్యేక ఆహ్వానం చిత్తూరు జిల్లాలోని కసూర్బా పాఠశాలల్లో చదువుకునే తొమ్మిది మంది బాలికలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఇదే పాఠశాలల్లో చదువుతున్న బాలికలు ఇద్దరు సైన్సులో కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన నాసా అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు అర్హత సాధించి, ప్రత్యేక ఆహ్వానం పొందారు. ఇప్పటి వరకు కార్పొరేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ పోటీలకు ఎంపికైన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. కాని తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు సాసా సదస్సుకు ఎంపికై రికార్డు సృష్టించారు. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 21న హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా ఈపదకొండు మందీ అత్యున్నత ప్రతిభను కనబరిచారు. దీంతో వీరందరికీ కాన్సులేట్ వీసాను మంజూరు చేసింది. ఈ సందర్భంగా అమెరికన్ కాన్సులేట్ జనరల్ కెథరీ అడ్డా కూడా విద్యార్థినుల ప్రతిభను ప్రశంసించారు. పట్టుదల ఉన్న పేద విద్యార్థినులను కలవడం గొప్పగా భావిస్తున్నానని చెప్పిన ఆమె ‘చీర్స్ టు ఇండియా’ అంటూ అమెరికన్ కాన్సులేట్ నుంచి అధికారిక ట్వీట్ చేయడం విశేషం. అబ్బురపడిన ‘నాసా’! దేశంలోని కస్తూర్బా పాఠశాలలు కేంద్ర ప్రభుత్వపు ‘సర్వశిక్ష అభియాన్’ కిందికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర డైరెక్టర్ అయిన జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెజిబీవీ రాష్ట్ర కార్యదర్శి పార్వతిదేవి, జిల్లా బాలికాభివృద్ధి అధికారి శ్యామలాదేవిలతో కలిసి పదకొండు మంది విద్యార్థినులూ ఈ నెల 23న హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నుంచి అమెరికా వెళ్లి, నాసాను సందర్శించారు. ‘అంతరిక్షంలో ఆవాసాలు’ అనే అంశంపై తాము రూపొందించిన నివేదికలను ఆ సదస్సులో ప్రదర్శించారు. అలాగే స్టాన్ఫోర్డు యూనివర్శిటీ, కాలిఫోర్నియాలోని సైన్సు కేంద్రం, డిస్నీలాండ్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చారు. నాసా వెళ్లొచ్చిన కెజీబీవీ విద్యార్థినులు కె.ప్రీతి: బంగారుపాళెం మండలానికి చెందిన కె.ప్రీతి బైరెడ్డిపల్లె కెజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే గుండెపోటుతో మరణించాడు. తల్లి మమత దినసరి కూలి. ప్రీతి ‘సఫిషియంట్ ప్లేస్ ఇన్ స్పేస్’ అనే అంశంపై నాసాకి పేపర్ ప్రజంటేషన్ చేసింది. గ్రహ కశలాలు భూమిని తాకడం వల్ల రాక్షస బల్లులు అంతరించినట్లుగానే మానవులు కూడా కాలక్రమంలో భూమిపై అకస్మాత్తుగా ఆవాసాన్ని కోల్పోతారు కనుక అంతరిక్షంలో నివాస స్థలాలపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నివేదిక పొందుపరిచింది. ఐఎఎస్ కావడమే తన లక్ష్యమని ప్రీతి అంటోంది. టి.సాయిశ్రీ: రొంపిచెర్ల కెజీబీవీలో ఏడవ తరగతి చదువుతున్న టి.సాయిశ్రీ తండ్రి శ్రీరాములురెడ్డి దినసరి కూలి. తల్లి సాధారణ గృహిణి. ఈమె ‘అగ్రికల్చర్ ఇన్ స్పేస్’ అనే అంశంపై నాసాకు పేపర్ ప్రజంట్ చేసి మన్ననలు పొందింది. డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని సాయిశ్రీ అంటోంది. ఎం.పూజ: కె.వి.పల్లె కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న పూజ తండ్రి నాగిరెడ్డి దినసరి కూలి. తల్లి సాధారణ గృహిణి. ‘ట్రాన్స్‌ఫోర్టు ఇన్ స్పేస్’అనే అంశంపై పూజ నాసాలోని సదస్సులో పేపర్ ప్రజంట్ చేసి అక్కడి అధికారులచే శభాష్ అనిపించుకుంది. సాప్ట్వేర్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యమని అంటోంది. జి.దివ్య: కె.వి.పల్లె కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న జి.దివ్య తండ్రి జి.దామోదర్‌రెడ్డి దినసరి కూలి. తల్లి సా«ధారణ గృహిణి. ‘మెటీరియల్ యూజ్డ్ ఇన్ స్పేస్’ అనే అంశంపై సాసా సదస్సులో పేపర్ ప్రజంట్ చేసి అక్కడి అధికారుల ప్రశంసలు పొందింది. పోలీసు అధికారి కావడమే తన ధ్యేయమని దివ్య చెబుతోంది. సైదాబాను: మదనపల్లెకు చెందిన సైదాబాను పుంగనూరులోని మైనార్టీ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ సంరక్షణలో పెరుగుతోంది. ‘అంతరిక్షంలో పరిశ్రమలు’ అనే అంశంపై సదస్సులో పేపర్ ప్రజంట్ చేసి తన ప్రతిభను చాటుకుంది. సైంటిస్టు కావాలన్నదే తన ఆశయమని సైదాబాను అంటోంది. కె.రెడ్డిరాణి: కలకడ కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న కె.రెడ్డిరాణి తండ్రి మనోహర వ్యవసాయ కూలి. తల్లి గృహిణి. ‘గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ స్పేస్’ అనే అంశంపై నాసా పేపర్ ప్రజంట్ చేసి అందరి అభినందనలు పొందింది. డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని రెడ్డిరాణి అంటోంది. సి.స్నేహ: గంగవరం కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న సి.స్నేహ తండ్రి సి.సుధాకర్‌రెడ్డి దినసరి కూలి. తల్లి గృహిణి. ‘ పుడ్ ఇన్ స్పేస్’ అనే అంశంపై నాసా సదస్సులో పేపర్ ప్రజంటేషన్ చేసింది. డాక్టర్ కావాలన్నదే తమ ఆశయమని స్నేహ అంది. ఎస్.రోష్ని: పుంగనూరులోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎస్.రోష్ని తండ్రి రెడ్డిబాషా ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. ‘ఎయిర్ ఇన్ స్పేస్ ’ అనే అంశంపై నాసా సదస్సులో పేపర్ ప్రజంటేషన్ చేసి శభాష్ అనిపించుకుంది. స్టీఫెన్ హాకింగ్ సిద్ధా్దంతం తమ ప్రయత్నానికి పునాదని రోష్ని అంటోంది. ఐఎఎస్ కావడమే తన లక్ష్యమని ఆమె చెబుతోంది. బి.ప్రత్యూష: నిమ్మనపల్లె కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న బి.ప్రత్యూష తండ్రి వెంకటరమణ సగటు ఉద్యోగి. తల్లి గృహిణి. ‘అంతరిక్షంలో వసతులు’ అనే అంశంపై నాసా సదస్సులో ఆమె పేపర్ ప్రజంటేషన్ చేసింది. వైద్యరంగంలో రాణించాలన్నదే తన లక్ష్యమని అంటోంది. చెంచులావణ్య: నెల్లూరు జిల్లా కొల్లపట్టుకి చెందిన ఎం.చెంచు లావణ్య తడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి చెంచయ్య దినసరి కూలి. తల్లి సుజాత గృహిణి. ‘టెంపరేచర్’ అనే అంశంపై నాసా సదస్సులో పోస్టర్ ప్రజంట్ చేసింది. కలెక్టర్ కావాలన్నదే తన ధ్యేయమని చెబుతోంది. వి.అశ్విని: నెల్లూరు జిల్లా గాంధీనగర్‌కు చెందిన వి.అశ్విని, వెంకటగిరి కేజీబీవీలో ఎనిమిదోతరగతి చదువుతోంది. తండ్రి శివశంకర్‌ప్రసాద్ వంట మనిషి. తల్లి శాంతి గృహిణి. నాసా సదస్సులో ‘గ్రావిటీ’ అనే అంశంపై పోస్టర్ ప్రజంటేషన్ చేసింది. డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. – మాడా. చంద్రమోహన్ -
జిల్లాలో విద్యాభివృద్ధికి రూ.213 కోట్లు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ద్వారా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 213.25 కోట్ల రూపాయలతో వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మొత్తంలో రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి 191.73 కోట్ల రూపాయలు, 37 కస్తూరిబా గాంధీ విద్యాలయాల (కేజీబీవీల) నిర్వహణకు 21.52 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది జిల్లాలోనే వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. గతంలో ఈ ప్రణాళికను హైదరాబాద్‌లోనే తయారు చేసి అక్కడే సమర్పించి వచ్చేవారు. అయితే, ఈ ఏడాది జిల్లాలోనే ప్రణాళికను రూపొందించి కలెక్టర్ ఆమోదంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ (ఎస్పీడీ)కి సమర్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఏ రాజేశ్వరరావు, రాజీవ్ విద్యామిషన్ ఏఎస్వో ఎన్.అంజిరెడ్డి తెలిపారు. ఈ ప్రణాళికను ఎస్పీడీ కార్యాలయంలో ఆమోదించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళికను ఆమోదించిన అనంతరం జిల్లాకు నిధులు కేటాయిస్తారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో సింహభాగం.. అంటే 44.77 కోట్ల రూపాయలు సివిల్ వర్కులకు కేటాయించారు. ఈ మొత్తంలో ప్రహరీల నిర్మాణానికి 27.22 కోట్లు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేకంగా హెచ్ఎం గదులు నిర్మించేందుకు 3.96 కోట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల మరమ్మతులకు 3.56 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి 1.26 కోట్లు, తాగునీటికి కోటి, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎం గదుల నిర్మాణాలకు 5.44 కోట్లు, మరమ్మతులకు 46 లక్షల రూపాయలు కేటాయించారు. ప్రణాళికలోని అంశాలు ఇవీ... జిల్లాలోని 2,63,840 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేసేందుకు 10.55 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించారు. 1,36,666 మంది బాలికలకు 5.46 కోట్లు, ఎస్సీ బాలురు 46,442 మందికి 1.85 కోట్లు, ఎస్టీ బాలురు 10,188 మందికి 40.75 లక్షలు, దారిద్య్రరేఖకు దిగువనున్న బాలురు 70,544 మందికి 2.82 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉపాధ్యాయుల జీతాలకు 61.52 కోట్ల రూపాయలు మండల విద్యా వనరుల కేంద్రాల అభివృద్ధికి, రిసోర్సు పర్సన్లు, సీడబ్ల్యూఎస్ఎస్ రిసోర్స్ పర్సన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టీఎల్ఎం గ్రాంటుకు 10.56 కోట్లు, పాఠశాలల సముదాయాల అభివృద్ధికి, క్లస్టర్ కో ఆర్డినేటర్ల జీతాలకు 4.30 కోట్ల రూపాయలు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల కొనుగోలుకు 5.34 కోట్ల రూపాయలు పాఠశాలల నిర్వహణ గ్రాంటుగా 2.32 కోట్లు, మూడు తరగతులున్న 2,484 పాఠశాలలకు 1.24 కోట్లు, మూడు కంటే అదనంగా తరగతి గదులున్న 1,079 పాఠశాలలకు 1.08 కోట్ల రూపాయలు పాఠశాల గ్రాంటుగా 2.21 కోట్లు, 3,236 ప్రాథమిక పాఠశాలలకు 1.62 కోట్లు, 849 ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలలకు 59.43 లక్షలు ఉపాధ్యాయ గ్రాంటుగా 68.62 లక్షలు, ఈ మొత్తంలో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 9,180 మంది టీచర్లకు ఒక్కొక్కరికి 500 చొప్పున 46 లక్షలు, ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలల్లో పనిచేస్తున్న 4,544 మంది టీచర్లకు 23 లక్షలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు 3.35 కోట్లు, ఈ మొత్తంతో ఫిజియోథెరపీ శిక్షణ కేంద్రాలు, ఉపకరణాల పంపిణీ, ఇతర కార్యక్రమాల నిర్వహణ బాలికా విద్య కార్యక్రమాలకు 20 లక్షలు, విద్యాహక్కు చట్టంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు 15 లక్షలు బడి బయట ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చి వారిని రెగ్యులర్‌గా పాఠశాలల్లో చేర్పిం చేందుకు ఆర్‌ఎస్‌టీసీలు, ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ లు, దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు హాజరయ్యే పిల్లలకు రవాణా ఖర్చులు చెల్లించేందుకు 5.38 కోట్ల రూపాయాలు ప్రాజెక్టు నిర్వహణకు 3 శాతం నిధులు (4.73 కోట్ల రూపాయలు) కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల నిర్వహణకు 21.52 కోట్ల రూపాయలు విద్యార్థినులకు మెస్ చార్జీలు, ఇతర వసతులకు ఒక్కొక్కరికి నెలకు 900 చొప్పున 4.80 కోట్లు, ఒక్కొక్కరికి 50 చొప్పున నెలవారీ స్టైఫండ్ చెల్లించేందుకు 26.64 లక్షల రూపాయలు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు, స్పెషలాఫీసర్ల జీతాలు చెల్లించేందుకు 8.42 కోట్ల రూపయాలు బాలికలకు వైద్య ఖర్చులకు 33 లక్షలు, యూనిఫారాలు పంపిణీ చేసేందుకు 66 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించారు.