katama rayudu
-
‘కాటమరాయుడు’ రీమేక్‌ని పక్కన పెట్టిన సల్మాన్, కారణం ఇదేనా?
సౌత్ సైడ్ ఏదైనా మూవీ హిట్ అయితే చాలు. బాలీవుడ్ లో సల్మాన్ అలెర్ట్ అయిపోతాడు. వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తాడు. అలా సౌత్ లో సూపర్ హిట్టైన వీరమ్ మూవీని, గతంలోనే సల్మాన్ బాలీవుడ్ లోకి రీమేక్ చేయాలనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నాడట. ఆ సౌత్ రీమేక్ ను పక్కన పెట్టాడట. 2014లో విడుదలైన వీరమ్ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ ఊరమాస్ లుక్ కు కోలీవుడ్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 80 కోట్లకు పైగా వసూళ్లను అందించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ అయింది. హిందీలో సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీవాళి పేరుతో రీమేక్ చేయాలనుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కాని ఇప్పుడు ఈ రీమేక్ ఆగిపోయిందని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఓటీటీలో రిలీజ్ చేసిన న్యూ మూవీ రాధే. ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది. దాంతో సల్మాన్ షాక్ కు గురైయ్యాడని సమాచారం. తాను చేస్తున్న, చేయాల్సిన ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడట. అందులో భాగంగా అంతిమ్, టైగర్ 3 చిత్రాలు తప్పితే మిగితా ప్రాజెక్ట్స్ అన్నిటినీ హోల్డ్ లో పెట్టాడట. కాటమరాయుడు హిందీ రీమేక్ ను క్యాన్సిల్ చేసాడట. ప్రస్తుతం సల్మాన్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ లో మాస్టర్ రీమేక్, దబాంగ్ 4, కిక్ 2, చిత్రాలు ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తోంది. ఓటీటీలోకి మరో మూవీ ఈద్ కానుకగా రాధే ను ఇటు ఓటీటీలోను, అటు థియేటర్స్ లోనూ ఒకేసారి రిలీజ్ చేసాడు సల్మాన్. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో అంతిమ్ కూడా విడుదల కానుందట. దేశంలో పూర్తిస్థాయిలో థియేటర్స్ తెరుచుకోకపోవడంతో, సింగిల్ స్క్రీన్స్, జీ5 యాప్ లో అంతిమ్ మూవీ ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మూవీలో సల్మాన్, ఆయన బావమరిది ఆయుష్ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో గ్యాంగ్ స్టర్ రోల్ ను ఆయుష్, అలాగే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను సల్మాన్ చేస్తున్నాడు. -
పవన్‌తో నటించడం ప్రత్యేకమన్న హీరోయిన్
చెన్నై: సినీ గ్లామర్‌తో నటుల ప్రవర్తనలో మార్పు రావడం సహజం. కానీ, సౌత్ బ్యూటీ శృతిహాసన్ మాత్రం ఏమి మారలేదంటూ, సినిమాలే తనని బలంగా మార్చయని, సినిమాలకు రాక ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నానని చెప్పుకోస్తోంది. ప్రస్తుతం స్నేహితులతో అలానే గడుపుతున్నానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సినిమా అనేది ఉద్యోగం కన్నా ఎక్కువని, ఇది మనందరి కలల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. సినిమాల్లో ఎనిమిది ఏళ్లుగా నటిస్తున్నానని, వెనక్కి తిరిగి చూస్తే నటించడంతో బలంగా మారానని చెప్పింది. కమల్‌హాసన్, సారికాల కూతురిగా ఎలా పెరిగానో అలానే ఉన్నానని, ఇప్పటికి వారితోను, స్నేహితులతోను సంతోషంగా ఉంటున్నానని పేర్కొంది. శృతి హాసన్‌కు కెరీర్ మొదట్లో అన్ని అపజయాలే ఎదురయ్యాయి. ఆమె నటించిన లక్, అనగ అనగా ఓ ధీరుడు, 7ఏఎం అరివూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అయినా తను నిరాశ చెందలేదని, ఈ సినిమాల్లో బాగా నటించానని, దర్శకుల సూచనలు పాటించానని చెప్పింది. సినిమాల విజయాలు, వైఫల్యాలకు నటులే కారణం కాదని అనేక విషయాలు ఉంటాయని చెబుతోంది. అందరిలా ఫెయిల్యూర్స్‌ను పట్టించుకోనని, ఓ మై ఫ్రెండ్, 7ఏఎం సినిమాల్లో నటించినందుకు గర్వంగా ఉందని ఈ సినిమాలు ప్రత్యేకమని తెలిపింది. శృతిహాసన్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్‌సింగ్‌తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడు కృతజ్ఞురాలినని ఆమె తెలిపింది. పవన్ చాలా సపోర్ట్ చేశాడని అది ఎప్పటికి మర్చిపోలేనని చెప్పింది. శృతి, పవన్‌ల అపకమింగ్ చిత్రం కాటమరాయుడు షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఆయనతో నటించడం ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పింది. -
'కాటమరాయుడు' వచ్చేస్తున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఇప్పటికే రెండు ప్రీ లుక్ పోస్టర్స్‌తో ఊరించిన పవన్, ఫైనల్‌గా ఫేస్ చూపించాడు. తమిళ సినిమా వీరంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమాలో పవన్ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్‌తో సినిమాలో పవన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించేశారు. ఈ రోజు(డిసెంబర్ 31) అర్ధరాత్రి ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండగా అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
'కాటమరాయుడు' వచ్చేస్తున్నాడు