ఇది రొటీన్ కథనం కాదు!
గతంలో ‘థియేటర్లో’ అనే సినిమా నిర్మించిన సాయి కిరణ్ ముక్కామల దర్శకునిగా మారారు. మాంత్రిక్స్ మీడియా పతాకంపై రంజిత్, అర్చన జంటగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కథనం’. సాబు వర్గీస్ స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌ను రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు, టీజర్‌ను సీనియర్ దర్శకులు ఎ.కోదండరామి రెడ్డి, బిగ్ సీడీని డెరైక్టర్ పూరీ జగన్నాథ్, పాటల సీడీని నటుడు తనికెళ్ల భరణి విడుదల చేశారు. ‘‘ప్రతి మనిషికీ ఓ కథ, కథనం ఉంటుంది.
ఈ చిత్రంలో కథ రొటీన్‌గా ఉండదు. కథనం ఏంటో తెరపైనే చూడాలి’’ అన్నారు దర్శక-నిర్మాత. ‘‘పోస్టర్స్, ప్రోమో, టైటిల్, ట్యాగ్ లైన్ బాగున్నాయి. ప్రతి మనిషికీ బిగ్గెస్ట్ పెయిన్ ప్రకృతి నుంచే వస్తుంది. దేవుడు అందరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడు’’ అని పూరీ జగన్నాథ్ అన్నారు. రంజిత్, అర్చన తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ఐ.సునీల్ కుమార్.