కత్తి రెడ్డి : ఎత్తితే దించడు
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అంతగా ఫాంలో లేని బ్రహ్మీ లీడ్ రోల్లో సినిమా అంటే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కత్తి రెడ్డి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఎత్తితే దించడు అనేది ట్యాగ్ లైన్.
రవి వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యాంకర్ రవి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. టైటిల్‌తో పాటు బ్రహ్మీ రవిల కాంబినేషన్‌పై అంచనాలు బానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏ మాత్రం ఫాంలోని లేని బ్రహ్మానందం లీడ్ యాక్టర్‌గా సినిమాను ఎంత వరకు కాపాడగలడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోసాని కృష్ణమురళీతో నేను కిడ్నాప్ అయ్యానోచ్ సినిమా చేస్తున్న బ్రహ్మీ, లీడ్ యాక్టర్ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.