కాట్రావులపల్లిలో నిశబ్దపు ఛాయలు
ఏఓబీ ఎ¯ŒSకౌంటర్లో మావోయిస్టు కామేశ్వరి మృతిపై విషాదం
భర్త శ్రీనివాసరావును గుర్తు తెచ్చుకుంటున్న గ్రామస్తులు
జగ్గంపేట :
ఆంధ్ర – ఒడిశా సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎ¯ŒSకౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులలో మండలంలోని కాట్రావులపల్లికి చెందిన దువ్వూరి కామేశ్వరి ఉండడడంతో ఆ గ్రామంలో నిశబ్దపు ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కుమారుడు దివంగత కామ్రేడ్ శ్రీనివాసరావుకు మృతురాలు కామేశ్వరి భార్యగా తెలియడంతో కాట్రావులపల్లి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు జ్ఞాపకాలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఏఓబీ ఎ¯ŒSకౌంటర్ నేపథ్యంలో తమ గ్రామం పేరు వెలుగులోకి రావడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే భయంతో గ్రామస్తులు మంగళవారం గడిపారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తారనే చర్చ సాగింది. ఆమె భర్త కుటుంబ సభ్యులు మాత్రం తమకేమీ సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు.
2001లో అజ్ఞాతంలోకి..
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దువ్వూరి సుబ్బారావు గ్రామంలో ఉపాధ్యాయుడిగా మంచి గుర్తింపు పొందారు. కమ్యూనిస్టు భావజాలం గల ఆయనకు ఒక కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఉన్నారు. చిన్నతనం నుంచే చురుకుగా ఉంటే శ్రీనివాసరావు గ్రామంలో టె¯ŒS్త వరకు చదివి టాపర్గా నిలిచాడు. పెద్దాపురంలో ఇంటర్మీడియట్, కాకినాడలో ప్రభుత్వ ఐటీఐ విద్యనభ్యసించి ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగంలో చేరాడు. ఏలేశ్వరం, గోకవరం, రాజమహేంద్రవరం డిపోలలో పనిచేశారు. ఆయా డిపోలలో యూనియన్ల కోసం పనిచేసి 2001లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 2011లో జరిగిన ఎ¯ŒSకౌంటర్లో శ్రీనివాసరావు మృతి చెందడంతో గ్రామంలో అతడి మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించారు. గ్రామంలో యువజన సంఘం ద్వారా చేపట్టిన పనులు ఆయనకు గుర్తింపునివ్వగా, మంచి ప్రసంగ కర్త అని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన దళాలలో ఉండగానే కామేశ్వరితో పరిచయం వివాహానికి దారి తీసి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై ఆయన తండ్రి, కామేశ్వరి మామగారు దువ్వూరి సుబ్బారావు మాస్టారును ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘‘కుమారుడు శ్రీనివాసరావు 2001లో అజ్ఞాతంలోకి వెళ్లి పదేళ్ల తరువాత 2011లో జనవరి 9న ఎ¯ŒSకౌంటర్ అయ్యాడు. ఆయనకు శాస్రీ్తయంగా వివాహం జరగలేదు. కామేశ్వరి మీ కోడలని మృతదేహాన్ని తీసుకువెళ్లాలని సమాచారం వచ్చింది. అందుకు మేము సిద్ధంగా లేం’’ అని తెలిపారు.