ఆ సీన్లో కత్రినా కైఫ్ నటించలేదు
కోల్‌కతా: సెన్సార్ బోర్డుతో తమకు ఎలాంటి వివాదాలులేవని బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ఫిల్మ్ 'బార్ బార్ దేఖో' దర్శకుడు నిత్యా మెహ్రా చెప్పింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ నటించిన ఓ సీన్‌కు సంబంధించి సెన్సార్ బోర్డుతో విబేధాలు ఏర్పడినట్టు వచ్చిన వార్తలు నిజంకాదని స్పష్టం చేసింది.
ఈ సినిమాలో కత్రినా కైఫ్ బ్రాతో ఓ సీన్లో నటించలేదని, కాబట్టి ఈ సీన్‌ను సెన్సార్ బోర్డు కట్ చేసే అవకాశమేలేదని మెహ్రా చెప్పింది. ఈ సినిమాలో ఎక్కడా అసభ్యకరదృశ్యాలు లేవని, సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపింది. సిద్ధార్థ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఏ సీన్‌ను కట్ చేయలేదని, కథలో మార్పులేదని సిద్ధార్థ చెప్పాడు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనుంది. భోజనం తక్కువగా తీసుకోవడంతో పాటు జిమ్‌లో బాగా కష్టపడ్డానని కత్రినా చెప్పింది.