'బీజేపీతో వేర్పాటువాదం అంతమైంది'
కర్నాల్: హర్యానా రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రాంతీయ వాదం పూర్తిగా నశించిందన్నారు. ఆదివారం కర్నాల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్ నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ 2015 ప్రారంబోత్సవ కార్యక్రమంలో కట్టర్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం సంతులనంతో కూడిన అభివృద్ధిని సాధిస్తున్నందున ఏ ప్రత్యేక ప్రాంతానికి నష్టం జరగడం లేదన్నారు. కులం, మతం ప్రాతిపదికన ప్రజలు వేర్పాటు వాదాన్ని కోరుకునే స్థితి నుండి ప్రజలు బయటపడ్డారన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికుల వేతనాలను పెంచుతున్నట్లు కట్టర్ ప్రకటించాడు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచనున్నట్లు చెప్పారు. హర్యానా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.