నేడు పోలీసు మెడల్ స్వీకరించనున్న ఏసీపీ జనార్దన్
వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కాజీపేట ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న బి.జనార్దన్ సోమవారం ఇండియన్ పోలీస్ మెడల్ స్వీకరించనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న స్వా తంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయనకు సీఎం కేసీఆర్ మెడల్ అందజేస్తారు. కాగా, జనార్దన్ 1994 లో సేవా పతకం, 2013లో ఉత్తమ సేవా పతకంతో పాటు 65కుపైగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జనార్దన్‌ను సీపీ సుధీర్‌బాబు, పోలీసు అధికారులు అభినందించారు.