రైల్వే... వివక్షే
మహాజాతరకు కానరాని ప్రత్యేక రైళ్లు
ఊసే లేని అదనపు బోగీలు
అధిక ఆదాయం సమకూరుతున్నా.. నిర్లక్ష్యం వీడని అధికారులు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ... కుంభమేళాను తలపించే జాతర... ఆసియూ ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది... అలాంటి విశిష్టత ఉన్న మహా జాతరపై రైల్వే శాఖ వివక్ష చూపిస్తోంది. కొత్త రైళ్లు, ప్రత్యేక రైళ్లు, పలు యూనిట్ల కేటాయింపులో రైల్వే అధికారులు ఆంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తూ... తెలంగాణపై వివక్ష చూపుతున్నట్లు ఇదివరకే అపవాదును మూటగట్టుకున్నారు.
సంక్రాంతి, దీపావళి పండుగలు, తిరుమల బ్రహ్మోత్సవాలు, శబరిమల, షిర్డీ యాత్రలతోపాటు వేసవి సీజన్లలో ఆంధ్ర ప్రాంతానికి నేరుగా ప్రత్యేక రైళ్లు, యాత్ర రైళ్లు, కొత్త రైళ్లు వేస్తున్న విషయం తెలిసిందే. కానీ... తెలంగాణ ప్రాంత ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే దసరా, శ్రీ రామనవమి వంటి పండుగలు, తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల యూత్రలకు ప్రత్యేక రైళ్లు, కొత్త రైళ్లు వేయడం గానీ... ఉన్నవాటికి బోగీలను పెంచడం వంటి చర్యలు గానీ తీసుకున్న దాఖలాలు లేవు. తెలంగాణపై రైల్వే శాఖ చిన్న చూపు చూస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
అంతేకాకుండా... కోటి మంది భక్తులు వచ్చే మేడారం జాతరకు దక్షిణ మధ్య రైల్వే కనీస ఏర్పాట్లు చేయకపోవడం తెలంగాణ ప్రాంత ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా... ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వనదేవతల సందర్శనానికి వస్తున్నారు. ఇందుకు గత జాతరలే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నారుు. అరుునప్పటికీ... రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టకపోవడంతోపాటు తెలంగాణ ప్రాంతంలో తిరిగే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.
అధిక ఆదాయం సమకూరుతున్నా...
తెలంగాణ ప్రాంతంలో సిమెంట్ కంపెనీలు, బొగ్గు రవాణ, క్వారీ రాళ్ల ఎగుమతి, సున్నపురాయి. ఎఫ్‌సీఐ కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలు ఉన్నారుు. వీటి నుంచి ైరె ల్వే శాఖకు భారీ ఆదాయం వస్తోంది. అంతేకాదు... దక్షిణ మధ్య రైల్వేకు అధిక ఆధాయం కాజీపేట జంక్షన్ నుంచే సమకూరుతోంది. ఇంతటి ప్రాధాన్యం గల కాజీపేట జంక్షన్‌పై రైల్వే శాఖ శీతకన్ను వేయడం తెలంగాణ ప్రజలను ఆవేదనకు గురిచేస్తోంది. మేడారం జాతరకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లాలో అతి ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన కాజీపేట, వరంగల్ మీదుగా తెలంగాణ ప్రాంతంలో కొత్త రైళ్లు గానీ, అదనపు రైళ్లు గానీ... ఉన్న రైళ్లకు అదనపు బోగీలు గానీ ఏర్పాటు చేయూలని కోరుతున్నారు. ఆ దిశగా జిల్లాకు చెందిన ఎంపీలు, మంత్రులు చొరవచూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్ర లాబీయింగే కారణం
రైల్వే శాఖలో ఆంధ్ర అధికారుల లాబీయింగ్ వల్లే తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతోంది. వారి వల్ల ఇప్పటికే డోర్నకల్ జంక్షన్ నిర్వీర్యమైంది. అదేబాటలో కాజీపేట జంక్షన్‌ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. మేడారం జాతర ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగ. జిల్లాకు నేరుగా ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో వివిద రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేయూలి.
- దేవులపెల్లి రాఘవేందర్, రైల్వే జేఏసీ కన్వీనర్
మేడారానికి ప్రత్యేక రైలు మార్గం వేయాలి
రెండేళ్లకోసారి కుంభమేళాను తలపించే మేడారం మహా జాతరకు జిల్లా హెడ్‌క్వార్టర్ నుంచి రైలు మార్గం వేయాలి. రానున్న రైల్వే బడ్జెట్లో మేడారం జాతరకు నూతన రైల్వే లేన్ మంజూరు చేయాలి. ఇది అమల్లోకి వస్తే జిల్లాలోని చాలా గ్రామాలు అభివృద్ధి చెందడంతోపాటు రైల్వేకు ఆదాయం వస్తుంది. ఈ మేరకు ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషి చేయూల్సిన అవసరం ఉంది.
- సీహెచ్.తిరుపతి, రైల్వే నాయకుడు