kc patel
-
ఎంపీలకు వల.. కిలేడీ అరెస్ట్!
న్యూఢిల్లీ: ఎంపీలను బురిడీ కొట్టించిన కిలేడీని ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాపురంలోని ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలను కలిసి వారికి మాయమాటలు చెప్పి ఏదో రకంగా వారితో అసభ్యంగా ఫొటోలు దిగి బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళను ఢిల్లీ పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు. ఇటీవల గుజరాత్‌లోని వల్సాద్కు చెందిన బీజేపీ ఎంపీ కేసీ పటేల్‌కు మత్తుమందు ఇచ్చి ఆపై ఆయనతో అసభ్యంగా ఫొటోలు దిగిన ఆ మహిళ రూ.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అంతా మోసమని గ్రహించిన ఎంపీ పటేల్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. మార్చి నెలలో డిన్నర్‌కు పిలిచి అత్యాచారం చేశారని, ఆసమయంలో తాను ఎలాగోలా వీడియో తీశానని మహిళ ఆరోపించడం అప్పట్లో కలకలం రేపింది. ఘజియాబాద్ పోలీసుల వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఆ మహిళ కోరింది, ఢిల్లీ పరిధిలో అన్యాయం జరిగింది కనుక అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఢిల్లీ పోలీసుల వద్దకు వెళ్లి ఎంపీ కేసీ పటేల్ పలుమార్లు తనపై అత్యాచారం చేశానని కథలు చెప్పింది. అయితే ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గతేడాది హర్యానాకు చెందిన ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన ఆ మహిళ.. కేసు విచారణ ప్రారంభించగానే కేసు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని భావించిన ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ముకేష్ మీనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఎంపీ కేసీ పటేల్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఓ మహిళ డబ్బు కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేసిందన్నారు. సాయం కోసం వచ్చిన మహిళ కూల్ డ్రింకులో మత్తుమందు కలిపిందని, ఆపై తన గ్యాంగుతో కలిసి కొన్ని వీడియోలు తీసిందని ఆరోపించారు. ఘజియాబాద్‌లో ఇల్లు రాసివ్వాలని లేనిపక్షంలో వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపారు. బ్లాక్ మెయిల్, దోపీడీకి సంబంధించిన విషయాలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, తాను నిర్దోషినని తేలుతుందని ధీమా వ్యక్తంచేశారు. -
ఎంపీలు తనను రేప్ చేశారంటూ...
ఏకంగా ఎంపీలకే బురిడీ కొట్టించి.. వాళ్లే తనను రేప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న మహిళను ఎట్టకేలకు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎంపీ కేసీ పటేల్‌కు మత్తుమందు ఇచ్చి, ఆయనతో అసభ్యంగా ఫొటోలు దిగి.. 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే వాటిని బయటపెడతానంటూ బెదిరించింది ఈ మహిళేనని తేలింది. ఆమె కోసం ఇంటిమీద దాడులు చేసినా, ఆమె మాత్రం దొరకలేదు. గుజరాత్‌లోని వల్సాడ్ ఎంపీ కేసీ పటేల్ తనను మార్చి 3వ తేదీన ఆయన అధికారిక నివాసానికి డిన్నర్ కోసం పిలిచారని అప్పటినుంచి పలుమార్లు ఆయన తనపై అత్యాచారం చేశారని, ఆయన తనను బెదిరించకుండా ఉండేందుకు తాను వీడియో తీసి సీడీ తయారుచేయాల్సి వచ్చిందని ఆమె కొన్నాళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘజియాబాద్ పోలీసుల వద్దకు వెళ్లి ఇదంతా చెప్పినా, ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు దాన్ని నమోదు చేయలేదు. నేరం జరిగిన ప్రాంతం తమ స్టేషన్ పరిధిలోకి రాదు కాబట్టి ఢిల్లీ పోలీసుల వద్దకు వెళ్లమని తెలిపారు. అక్కడ కూడా ఆమె అదే కథ చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే తాను సీడీ ఇస్తానని తెలిపింది. ఆమె చెప్పిన విషయం నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దాంతో ఆమె కోర్టుకు వెళ్తానని కూడా బెదిరించింది. చదవండి: బీజేపీ ఎంపీపై వల.. ఫొటోలతో బ్లాక్మెయిల్! ఈలోపు ఎంపీ కేసీ పటేల్ అసలు విషయం బయటకు వెల్లడించడంతో మొత్తం వివరాలు తెలిశాయి. స్పెషల్ కమిషనర్ ముకేష్ మీనా ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత.. గతంలో కూడా హరియాణాకు చెందిన ఒక ఎంపీని ఇలాగే ఆమె బుట్టలో వేసుకుని డబ్బులు ఇవ్వాలని బెదిరించి, ఆయన పట్టించుకోకపోవడంతో అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసిందని తేలింది. అప్పట్లో పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసి ఆమె తన ఫిర్యాదు వెనక్కి తీసుకుందని మీనా తెలిపారు. ఇది అచ్చంగా దోపిడీ కేసేనని, అందువల్ల అత్యాచారం కేసు నమోదు చేయలేదని ఆయన అన్నారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని.. తాను నిర్దోషినని తేలే క్షణం కోసం వేచి చూస్తున్నానని ఆయన చెప్పారు.