నేడు సమైక్య రన్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆర్కే బీచ్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సమైక్య రన్ నిర్వహిస్తున్నట్టు ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు తెలిపారు. ఎన్జీఓ హోమ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ రన్లో 50 వేల మంది విద్యార్థులు, ఉద్యోగులతో పాటు రైతులు పాల్గొంటున్నట్టు చెప్పారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమైక్య రాష్ట్రంకోసం ఉద్యమించాలని హితవు పలికారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ ఈ రన్లో పాల్గొనే వారందరికీ టీషర్టు పంపిణీ చేయనున్నట్టు వివరించారు.
బీచ్ రోడ్డులో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, అందులో టోకెన్లు తీసుకున్న వారికి మాత్రమే వీటిని అందజేస్తారన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ పోలాకి శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తాము కూడా సమ్మెలోకి దిగుతామని స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో కార్యాచరణను రూపొందించనున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.