KeerthiSuresh
-
ఘటోత్కచుడు శశిరేఖల హంగామా
శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోకి వెళితే మంచు మోహన్‌బాబు కనిపించారు... ఘటోత్కచుడి గెటప్‌లో! మరోపక్క కీర్తీ సురేశ్ ఉన్నారు... శశిరేఖ గెటప్‌లో! అక్కడ ఏం జరుగుతోందంటే... ‘మాయాబజార్’ షూటింగ్! మరి, దర్శకుడెవరు? కేవీ రెడ్డి గెటప్‌లో ఉన్న క్రిష్. కేవీ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గెటప్‌లో తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు. ‘మాయాబజార్’ని మళ్లీ తీస్తున్నారా? అన్నట్టుంది అక్కడ సీన్! కట్ చేస్తే... ఈ కంప్లీట్ సీన్‌ని మరొకరు డైరెక్ట్ చేస్తున్నారు. అతనే... నాగ అశ్విన్. అలనాటి అందాల తార సావిత్రి జీవితకథతో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న సినిమా ‘మహానటి’. సావిత్రి నట జీవితంలో మధురమైన చిత్రంగా నిలిచిన ‘మాయాబజార్’లోని కొన్ని సీన్లను ‘మహానటి’ కోసం తీస్తున్నారు. ఈ సీన్ల కోసం ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి పర్యవేక్షణలో ‘మాయాబజార్’ సెట్ వేశారు అవినాష్. ప్రస్తుతం ఆ సెట్లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇది తెలుసుకున్న సింగీతం సెట్‌కి వెళ్లారు. కేవీ రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘మహానటి’లో సావిత్రిగా కీర్తీ సురేశ్, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... కేవీ రెడ్డిగా క్రిష్ నటించనున్నారని ‘సాక్షి’ కొన్ని రోజుల క్రితం తెలిపింది. ఆ వార్తతో పాటు సింగీతంగా ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తున్నట్టు శనివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘యమదొంగ’లో ఒకసారి, ‘యమలీల–2’లో మరోసారి యముడిగా మోహన్‌బాబు పౌరాణిక పాత్రలో నటించి, మెప్పించారు. ‘మహానటి’లో ఘటోత్కచుడిగా ఆయన మెప్పిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. -
మణిరత్నం చిత్రంలో కీర్తీసురేష్?
తమిళసినిమా: మణిరత్నం తన చిత్రాల్లో కథానాయికలను అందంగా చూపిస్తారు. అదే సమయంలో వారి కథా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఐశ్వర్యారాయ్ నుంచి వర్ధమాన నటీమణుల వరకూ మణిరత్నం చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తారు. మణిరత్నం గత చిత్రం కాట్రువెలియిడై. కార్తీ, అతిథిరావు జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ స్పందననే అందుకోగలిగింది. కాగా మణి తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో రకరకాల ప్రచారాలు హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌తో చిత్రం అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత విజయ్‌సేతుపతి హీరోగా చిత్రం మొదలవ్వనుందనే ఊహాగానాలు తెరపైకొచ్చాయి. తాజాగా మణిరత్నం మాస్ మసాలా ఎంటర్టెయినర్గా మల్టీస్టారర్ చిత్రానికి రెడీ అవుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దుల్కర్సల్మాన్, అరవిందస్వామి, ఫాహత్ ఫాజిల్ ముగ్గురు హీరోలు నటించనున్నారని, వారికి జంటగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక నాయకిగా నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారని తాజా సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కీర్తిసురేష్‌కు మరో బంపర్ ఆఫర్
నటి కీర్తిసురేష్ ఇప్పుడు విజయాలకు చిరునామాగా మారారు. తొలి చిత్రం ఇదు ఎన్న మాయం చిత్రం యావరేజ్ అనిపించుకున్నా ఆ తరువాత చిత్రం రజనీమురుగన్ సంచలన విజయాన్ని సాధించి కీర్తిసురేష్ మార్కెట్‌ను కోలీవుడ్‌లో సుస్థిరం చేసింది. ఆ తరువాత నటించిన రెమో ఆమె స్థాయిని మరింత పెంచింది. ఇక ఇటీవల ఇళయదళపతి విజయ్‌తో నటించిన భైరవా చిత్రం కీర్తిను స్టార్ హీరోయిన్ ను చేసిందని చెప్పకతప్పదు. ఇలా కీర్తి ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయారు. మధ్యలో ధనుష్‌తో రొమాన్స్ చేసిన తొడరి చిత్రంలో ఆమె నటన ప్రశంసలను అందుకుంది. తాజాగా మరో స్టార్ హీరో సూర్య సరసన తానాసేర్న్‌ద కూటం చిత్రంలో నటిస్తున్నారు. మరో పక్క తెలుగులో పవన్ కల్యాణ్‌తో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతున్నారు. ఇక నానీతో నటించిన నేను లోకల్ చిత్రం ఫిబ్రవరి 3న తెరపైకి రానుంది. ఇంత బిజీగా ఉన్న కీర్తికి మరో అవకావం వరించింది. విశాల్‌కు జంటగా నటించడానికి సై అన్నారు. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్న విశాల్ తదుపరి లింగుస్వామి దర్శకత్వంలో సండైకోళి–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్‌హిట్ చిత్రం సండైకోళి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెల సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. చాలా గ్యాప్ తరువాత లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. దీన్ని విశాల్ తన ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నారు. కాగా దీని తరువాత లింగుస్వామి, టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్ ల కలయికలో తెరకెక్కనున్న ద్విభాషా చిత్ర నాయకీ అవకాశం కీర్తినే వరించిందన్నది గమనార్హం.