‘కేసీఆర్ అబద్ధ్దాల కోరు’
షాద్నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాల కో రు అని భారత్ కేత్ మజ్దూరు యూనియన్ జా తీయ ఉపాధ్యక్షుడు గుండా మల్లేష్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో జరగుతున్న వ్యవసాయ, కార్మిక రాష్ట్ర ప్రథమ మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాల ఫ్యా క్టరీగా మారారని, అతని నోటి వెంట అన్ని అబ ద్ధాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఉద్యమ స మయంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన ఆయన, రాష్ట్రం ఏర్పడిన తరువాత పదవిపై వ్యామోహంతో గద్దెనెక్కారని ఆరోపించారు.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని వాటిని తగ్గించలేని అసమర్థుడని మండిపడ్డారు. కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చి కూలీలను మద్యానికి బానిసగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉపాధిహమీ పనులను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి కూలీలకు 300రోజులు పని కల్పించాలన్నారు. ఉపాధిహమీ పథకంలో అక్రమాలను ఆరికట్టాలని సూచించారు. బీకేఎంయూ ఆధ్వర్యంలో కూలీలు, కరువు సమస్యలపై రాబోయే రోజుల్లో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.