Kenya athlete
-
'తృటిలో తప్పించుకున్నా.. ఆలస్యమయ్యుంటే గాల్లో ప్రాణాలు'
కెన్యాకు చెందిన అథ్లెట్ డేవిడ్ రుడిషా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కెన్యాలోని కిమానా వైల్డ్‌లైఫ్ సాంచురీలో జరిగిన మసాయి ఒలింపిక్స్ కాంపిటీషన్‌కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో అతను ప్రయాణిస్తున్న విమానం క్రాష్‌కు గురైంది. ఈ సమయంలో రుడిషాతో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ల్యాండింగ్ చేసే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ విమానం టేకాఫ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో విమానంకు చెందిన రెక్క ఒకటి చెట్లకు తగిలి గుండ్రంగా తిరుగుతూ మట్టి పెళ్లపై పడిపోయింది. అప్పటికే డోరు తీసుకొని రుడిషా సహా మిగతా ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం రుడిషాతో పాటు మిగతావారు క్షేమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఇక ప్రమాదంపై రుడిషా స్పందించాడు. ''మరో ఏడు, ఎనిమిది నిమిషాల్లో విమానం టేకాఫ్ తీసుకుంటుందనగా ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. విమానం రెక్క ఒకటి చెట్లకు తగిలి కింద పడడం ప్రారంభమైంది. అప్పటికే మేము గాయాలతో బయట పడ్డాం.. కొద్దిగా ఆలస్యమైనా మా ప్రాణాలు పోయేవే.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక డేవిడ్ రుడిషా 800 మీటర్ల రేసులో రెండుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో వరుసగా రెండు స్వర్ణ పతకాలు అందుకున్నాడు. అంతేకాదు 2011, 2015 వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ 800 మీటర్ల రేసులో పతకాలు సాధించాడు. David Rudisha after surviving a crash landing in Amboseli pic.twitter.com/aFzB6exHAl — Kenyans.co.ke (@Kenyans) December 11, 2022 -
Berlin: మారథాన్‌లో కిప్‌చోగె కొత్త ప్రపంచ రికార్డు
కెన్యా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ చాంపియన్ ఎలీడ్ కిప్‌చోగె మారథాన్‌లో తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. ప్రతిష్టాత్మక బెర్లిన్ మారథాన్‌లో 37 ఏళ్ల కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 1 నిమిషం 9 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2018 బెర్లిన్ మారథాన్‌లోనే 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్‌చోగె సవరించాడు. చదవండి: Julius Baer Generation Cup: రన్నరప్ ఇరిగేశి అర్జున్.. -
స్వర్ణం సాధించింది.. వెలుగునిచ్చింది!
రియో ఒలింపిక్స్ లో దేశానికి రజత, కాంస్య పతకాలను సాధించారని పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్‌లపై రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత క్రీడా సంఘాలు నజరానాలు ప్రకటించాయి. వీరితో పాటు వీరి కోచ్, ఇతర సహాయక సిబ్బందికి కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు మొదలయ్యాయి. ఇటీవల సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా దీపాకర్మాకర్, సాక్షి మాలిక్, పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్ కు బీఎండబ్ల్యూ కార్లు కూడా అందజేసి వారిని సన్మానించారు. అయితే కొన్ని దేశాల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. కెన్యా అథ్లెట్.. మిడిల్ డిస్టెన్స్ రన్నర్ ఫేత్ కిప్యేగాన్ విషయానికొస్తే ఆమె రియోలో స్వర్ణం సాధించడంతో పాటు తన గ్రామానికి వెలుగులు అందించింది. అదెలా అంటే.. రియోలో1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి గ్రామాని తిరిగి వెళ్లిన ఆమెను అధికారులు కలిశారు. ఈ సందర్భంగా కిప్యేగాన్ అధికారులను ఓ విజ్ఞప్తి చేసింది. 'మా గ్రామానికి మూడున్నర దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేదు. ఈ కారణం చేత నేను పాల్గొన్న ఈవెంట్ ను మా నాన్న టీవీలో చూడలేకపోయారు. దీంతో మరెన్నో సమస్యలను అధికారులకు, దేశాధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా దృష్టికి తీసుకెళ్లాను' అని స్వర్ణ విజేత తెలిపింది. వెంటనే అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి, కొన్ని రోజుల్లోనే అక్కడ విద్యుత్ కాంతులు నింపారు. కిప్యేగాన్ తండ్రి సామ్యూల్ కొయిచ్ కిప్యేగాన్ కూడా రియోకు ముందే కరెంట్ సరఫరా చేసి తన కూతురి రేస్ ను చూడాలని కోరారు. రియోలో కిప్యేగాన్ స్వర్ణాన్ని సాధించిన తర్వాత అధికారులు కేవలం 9 రోజుల్లోనే విద్యుత్ కాంతులతో కళకళలాడుతోంది. ఆమె విజయం కుటుంబానికే కాదు మొత్తం గ్రామానికి వెలుగులు నింపిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.