kerala artist
-
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ హాస్యనటుడి భార్య సూసైడ్..!
మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు ఉల్లాస్ పండళం భార్య ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని పతనంతిట్ట జిల్లా పండలంలోని వారి నివాసంలో ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే తన భార్య ఆశా(38) కనిపించడం లేదని ఉల్లాస్ కేరళ పోలీసులకు సమాచారమిచ్చాడు. సమాచారం అందుకున్న కేరళ పోలీసులు అతని నివాసానికి వెళ్లగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే ఉల్లాస్ ఇంట్లో ఉన్నప్పుడే ఆశా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె చనిపోయే ముందు రోజు మొదటి అంతస్తులో తన పిల్లలతో కలిసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఉల్లాస్ పండళం ఎవరు?: ఉల్లాస్ పండళం మాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడు. అతని ప్రదర్శనలతో సినిమాలలో ఫేమస్ అయ్యారు. ఉల్లాస్ మమ్ముట్టి నటించిన 'దైవతింటే సొంతం క్లీటస్'తో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా అతను 'ఇతు తాండ పోలీస్', 'కాముకి', 'మన్నార్ మత్తై స్పీకింగ్ 2', 'హాస్యం' లాంటి పలు చిత్రాలలో కూడా నటించాడు. -
నాలుకే అతడి కుంచె..
బొమ్మ గీయాలంటే ఏం కావాలి? కుంచె, కాన్వాస్, రంగులు.. ఇదేగా మీ సమాధానం. కానీ కేరళకు చెందిన చిత్రకారుడు అని.కె మాత్రం.. కాన్వాస్, రంగులు ఉంటే చాలంటారు. ఎందుకంటే నాలుకే ఆయన కుంచె. దాంతోనే ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఏసుక్రీస్తు నిలువెత్తు చిత్రపటం సహా ఎన్నో పెయింటింగ్స్ ఆయన నాలుక నుంచి జాలువారాయి. కేరళలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న అని.కె.. రంగులు కలపడానికి కూడా తన నాలుకనే వినియోగిస్తారు. ఒక్కో పెయింటింగ్ వేయడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం తీసుకుంటారు. అందరు చిత్రకారుల్లా కాకుండా కొత్త పద్ధతిలో చిత్రాలు గీయడం ద్వారా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మార్గం ఎంచుకున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆయన కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు. నాలుకతోనే రంగులు కలిపి, దాంతోనే చిత్రాన్ని గీయడం వల్ల తలనొప్పి, దవడ నొప్పితోపాటు దృష్టి మందగించడం, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఓ చిత్రం గీసిన తర్వాత దాదాపు రెండు వారాల వరకు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుకతోనే కాకుండా ముక్కు, గడ్డం, మోచేతులు, పాదాలతో కూడా చిత్రాలు గీయడం ఈయన ప్రత్యేకత. ఒకేసారి రెండు చేతులతో రెండు చిత్రాలు కూడా వేయగలరు.