భారత్ మాకు కీలక భాగస్వామి: అమెరికా
వాషింగ్టన్: అమెరికాకు భారత్ ఎప్పుడూ కీలక భాగస్వామిగానే ఉంటుందని అమెరికా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మీడియాకు తెలిపారు. అమెరికాలో భారత్ కొత్త రాయబారి నవతేజ్ సర్నాకు స్వాగతం పలికిన అనంతరం కిర్బీ మీడియాతో మాట్లాడుతూ...
‘ఒబామా పాలనలో భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశామని, భవిష్యత్తులో కూడా పూర్తిస్థాయిలో ఈ అంశంపై దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతం భారత్తో మంచి సంబంధాలను కలిగివున్నామని, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు తాము మరింత కృషి చేస్తామన్నారు. కొత్త రాయబారి నవతేజ్ సర్నాకు తాము అన్నివిధాలా సహకరిస్తామ’న్నారు.