‘పాక్’ ప్రధాన అభ్యర్థులెవరు? భారత్‌పై వైఖరి ఏమిటి?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 8న జరగనుంది. ఈ నేపధ్యంలో నవాజ్ షరీఫ్ నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చచే అంచనాలున్నాయి. పలు కేసుల్లో దోషిగా తేలి, జైలులో ఉన్నందున ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల రేసుకు దూరంగా ఉన్నారు. అయితే పాక్ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు ఎవరు? భారత్ విషయంలో వారి అభిప్రాయమేమిటన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
నవాజ్ షరీఫ్..
పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్)అధినేత నవాజ్ షరీఫ్ నాల్గవసారి ప్రధాని అవుతారనే అంచనాలున్నాయి. షరీఫ్ పలుమార్లు జైలుకు వెళ్లారు. ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛా మార్కెట్‌పై మంచి పట్టు ఉన్న నవాజ్ షరీఫ్ భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. తన పార్టీ మేనిఫెస్టోలో భారత్‌తో శాంతి చర్చలపై వాగ్దానం చేశారు. అయితే దీనితోపాటు పాటు ఒక షరతు కూడా విధించారు. కాశ్మీర్ నుంచి రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తే, అప్పుడు భారత్‌తో శాంతి చర్చలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
బిలావల్ భుట్టో జర్దారీ..
35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్ పార్టీ (పీపీపీ) నేత. బిలావల్ భుట్టో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ ప్రధాని అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. 2007లో బెనజీర్ హత్యకు గురయ్యారు. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే బిలావల్ పార్టీ పీపీపీ కింగ్ మేకర్ అవుతుంది. భారతదేశంపై బిలావల్ భుట్టో జర్దారీ వైఖరి బహువిధాలుగా ఉంది.
ఇమ్రాన్‌ఖాన్
2022లో పలు అవినీతి ఆరోపణలతో ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ద్వారా ప్రజల్లో నానుతున్నారు. సైన్యంతో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎన్నికలలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
2019లో ఇమ్రాన్ ఖాన్ శాంతి చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన పుల్వామా దాడి కారకులపై భారత్ చర్య తీసుకునేందుకు తన సంసిద్ధతను తెలిపారు.