ఖైరతాబాద్ నియోజకవర్గం: ఈసారి అధికారం ఎవరిది?
ఖైరతాబాద్ నియోజకవర్గం
ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈ సారి మాజీ మంత్రి దానం నాగేందర్ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, 2014లో గెలిచిన చింతల రామచంద్రారెడ్డిపై 28402 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. నాగేందర్ గతంలో మూడుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన కూడా గెలిచారు. 2009-2014 మధ్య కాంగ్రెస్ ఐ మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ఐ పక్షాన పోటీచేసి ఓటమి చెందిన తర్వాత కొంతకాలానికి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు.
2018లో టిక్కెట్ పొంది విజయం సాదించారు. కాగా ఇక్కడ మహాకూటమిలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన దాసోజు శ్రావణ్ సుమారు 33500 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు. నాగేందర్‌కు 63063 ఓట్లు రాగా, చింతల రామచంద్రారెడ్డికి 34666 ఓట్లు వచ్చాయి. నాగేందర్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఖైరతాబాద్‌లో ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు, నాలుగుసార్లు బిసి (మున్నూరుకాపు)నేతలు గెలవగా రెండుసార్లు వెలమ, ఒకసారి వైశ్య సామాజికవర్గం గెలిచాయి. నగరంలో ప్రాధాన్యత కలిగిన ఖైరతాబాద్ నియోజకవర్గం 1967 నుంచి ఏర్పడిరది. కాంగ్రెస్.
కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి ఒకసారి టిఆర్ఎస్ ఒకసారి గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. కాంగ్రెస్ ఐ ప్రముఖుడు పి. జనార్దనరెడ్డి ఐదుసార్లు గెలుపొందగా, 1967-72 టరమ్‌లో ఎన్.కృష్ణారావు ఉప ఎన్నికలోను, ఆ తర్వాత సాధారణ ఎన్నికలోను గెలిచారు. పి. జనార్ధన్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి గెలిచారు. తదుపరి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. నగరంలో గతంలో ముఖ్యనేతగా ప్రసిద్ది వహించిన బి.వి.గురుమూర్తి ఒకసారి ఇక్కడ గెలవగా, అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంటు నుంచి రెండుసార్లు విజయం సాధించారు.
ఇక్కడ గెలిచినవారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా మంత్రి పదవులు నిర్వహించడం విశేషం. బి.వి.గురుమూర్తి గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేయగా, పి.జనార్దనరెడ్డి 1981లో టి.అంజయ్య, 82లో భవనం వెంకట్రామ్ల మంత్రి వర్గాలలోను, 1991, 92లలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలోను బాధ్యతలు నిర్వహించారు. ఎమ్.రామచంద్రరావు 1983లో ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో ఉన్నారు.1984 తెలుగుదేశం సంక్షోభంలో రామచంద్రరావు నెలరోజుల నాదెండ్ల క్యాబినెట్లో కూడా పనిచేశారు.
కె. విజయరామారావు 1999 ఎన్నికల తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. బి.వి.గురుమూర్తి1954లో రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. దానం నాగేందర్ అంతకుముందు ఆసిఫ్‌నగర్‌లో మూడుసార్లు గెలిచారు. నాగేందర్ 2004లో టిడిపి పక్షాన పోటీ చేసి గెలుపొందడం విశేషం. అయితే కాంగ్రెస్ ఐ అధికారంలోకి రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, టిడిపికి రాజీనామా చేసి తిరిగి అసిఫ్‌నగర్‌లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 2009లో ఖైరతాబాద్‌లో గెలిచాక వైఎస్ క్యాబినెట్లో, తదుపరి రోశయ్య, కిరణ్ క్యాబినెట్ లలో పనిచేశారు.
2014లో ఓడిపోయారు. 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. 1999లో కెసిఆర్‌కు బదులుగా విజయరామారావుకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర చరిత్రే మారిపోయిందన్న అబిప్రాయం ఉంది. అసంతృప్తికి గురైన కెసిఆర్ తదుపరి కొంతకాలం ఉప సభాపతిగా ఉండి, ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టిఆర్ఎస్ ను స్థాపించి, తెలంగాణ రాష్ట్ర సాదనలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. విజయరామారావు సిబిఐ డైరెక్టర్‌గా రిటైర్ అయిన తర్వాత టిడిపిలో చేరి ఖైరతాబాద్‌లో గెలిచి మంత్రి అయ్యారు. ఆ విధంగా రాష్ట్ర విభజనకు ఇది ఒక కీలకమైన మలుపుగా చెబుతారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..