మూలకణాలతో మెదడు కేన్సర్ నిర్మూలన!
హూస్టన్: ప్రాణాంతక మెదడు కేన్సర్‌ను మూలకణాలతోనే నిర్మూలించేందుకు ఉపయోగపడే కొత్త విధానాన్ని భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఖలీద్ షా కనుగొన్నారు. హార్వార్డ్ స్టెమ్‌సెల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఖలీద్ షా ఎలుకలపై ప్రయోగం నిర్వహించి విజయం సాధించారు. ఎలుకల్లో మూలకణాలకు జన్యుపరంగా మార్పులు చేసిన ఆయన..
ఆ కణాలు కేన్సర్ కణాలను నిర్మూలించే విషాన్ని తట్టుకుంటూనే, ఆ విషాన్ని కేన్సర్ కణాల వద్ద మాత్రమే విడుదల చేసేలా అభివృద్ధిపర్చారు. జన్యుమార్పు చేసిన ఈ మూలకణాలు కేన్సర్ కణాలను మాత్రమే చంపుతూ, ఆరోగ్యకరణ కణాలకు ఎలాంటి హాని కలిగించకపోవడం విశేషం.