khariff marketing season
-
12 శాతం పెరిగిన ధాన్యం సేకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది సీజన్లో సేకరించిన ధాన్యంతో పోలిస్తే ఈసారి 12 శాతం అధికంగా సేకరించడం విశేషం. గత ఏడాది జనవరి మూడో వారానికి 5.50 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించగా, ఈ ఏడాది ఏకంగా 6.20 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించారు. మద్దతు ధరకు అనుగుణంగా రూ.1.28 లక్షల కోట్ల మేర చెల్లింపులు సైతం చేసినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజన్ మొత్తం ముగిసే నాటికి 9 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. నిజానికి గత ఏడాది ఖరీఫ్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1.42 లక్షల కోట్ల విలువైన 7.25 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భారీగా ధాన్యం సేకరణ జరుగుతోంది. పంజాబ్‌లో 1.81 కోట్ల మెట్రిక్ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌లో 92 లక్షలు, హరియాణాలో 58.97 లక్షలు, తెలంగాణలో 59 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరణ జరిగింది. -
దిగుబడి దెబ్బ
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్)లో లెవీ బియ్యం సేకరణ మందగించింది. నిన్నమొన్నటి వరకూ రైస్ మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐ ఆశాజనకంగానే బియ్యం సేకరించింది. ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మిల్లర్ల వద్ద నిల్వలు నిండుకున్నారుు. దీంతో ఇటీవల బియ్యం సేకరణ గణనీయంగా పడిపోరుుంది. గత ఖరీఫ్‌లో ఎకరాకు సగటున 35 బస్తాల చొప్పున ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ ఖరీఫ్‌లో తుపానులు, తెగుళ్లు తదితర కారణాల వల్ల దిగుబడులు గణనీ యంగా తగ్గాయి. ఎకరాకు సగటున 20 బస్తాల ధాన్యం మాత్రమే వచ్చింది. దీంతో మార్కెట్లో ధాన్యం దొరకని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో లెవీ సేకరణ లక్ష్యం 11 లక్షల 75 వేల 42 మెట్రిక్ టన్నులు. దిగుబడి తగ్గడంతో కనీస మద్దతు ధరకంటే క్వింటాల్‌కు రూ.100 చొప్పున అదనంగా చెల్లించి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల వద్ద ధాన్యం అరుుపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయూరుు. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకూ 2.37 లక్షల టన్నుల బియ్యూ న్ని మాత్రమే మిల్లర్లు ఎఫ్‌సీఐకి అందించారు. ప్రస్తుతం మార్కెట్లో స్వర్ణ రకం ధాన్యం ధర 75 కిలోలు లోడింగ్‌తో కలిపి రూ.1,050 పలుకుతోంది. మిల్లుకు చేరవేత ఖర్చులతో కలిపి రూ.1,075గా ఉంది. ఈ మొత్తం అధికమని భావిస్తున్న మిల్లర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యం కొని ఎఫ్‌సీఐకి లెవీ బియ్యం ఇస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ లెవీ సీజన్ మార్చి 31 నాటికి ముగుస్తుంది. గత సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించారు. ధాన్యం దిగుబ డులు తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 4 లక్షల టన్నులకు మించి బియ్యాన్ని లెవీగా ఇచ్చే పరిస్థితి లేదు. ఆకివీడు ప్రాంతంనుంచి లెవీ సేకరణ తక్కువగా ఉంది. ఉండి కాలువకు దిగువన ఊడ్పులు ఆలస్యంగా జరగటం, పంట చేతి కందే సమయంలో తుపానుల వల్ల పంట నష్టపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆ ప్రాంతంలో వ్యవసాయ భూ ములు చేపల చెరువులుగా మారటం కూడా లెవీపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ప్రస్తుత లెవీ లక్ష్యంలో 60 శాతానికి మించి బియ్యూన్ని సేకరించే పరిస్థితి కనబడటం లేదు. రబీలో ప్రకృతి కనుక కరుణిస్తే లక్ష్యానికి చేరువ కావచ్చనే అభిప్రాయం మిల్లర్లలో వ్యక్తమవుతోంది.