విశ్వేశ్వరునికి లక్ష ఖర్జూరార్చన
అప్పనపల్లి(మామిడికుదురు) :
శివోద్భవ దినమైన మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా గురువారం స్థా నిక శ్రీఅన్నపూర్ణా కాశీ విశ్వేశ్వరాలయంలో లక్ష ఖర్జూరార్చన వైభవంగా జరిగింది. పూ జ్యం జగన్నాథశర్మ ఆధ్వ ర్యంలో ఆలయార్చకుడు దొంతుకుర్తి సత్యనారాయణశర్మ నేతృత్వంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహన్యాసం, రుద్రాభిషేకం జరిపి అనంతరం లక్ష ఖర్జూరాలతో స్వామి వారిని అర్చించారు. అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను జరిపించారు. పలువురు భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివ కేశవ భక్త బృందం ఆధ్వర్యంలో 2005 నుంచి ఏటా శివుని పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.