‘ఖయ్యం భయ్యా’ సందడి
భోగాపురం: స్థానిక సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో ‘ఖయ్యం–భయ్యా’ చిత్ర షూటింగ్ చురుగ్గా సాగుతోంది. గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఇతివృత్తంతో సాగే చిత్రంలో ఒక పాట చిత్రీకరణను మంగళవారం ఇక్కడ చేపట్టారు. చిత్రంలో నందమూరి తారకరత్న, హర్షిత (కన్నయ్య ఫేం), ప్రియ (తొలి పరిచయం) హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నట్టు యూనిట్ సభ్యులు తెలిపారు. మైసమ్మ ఐపీఎస్ సినిమా దర్శకుడు భరత్ దర్శకత్వంలో, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తయ్యిందని, మార్చిలో సినిమా విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పాటకు స్వర్ణ కొరియోగ్రాఫర్ చేశారు. తారకరత్న, హర్షితలతో కూడిన బృంద నృత్యకారుల సెప్పులను చిత్రీకరించారు.