kidnap bid
-
14 ఏళ్ల బాలిక కిడ్నాప్ డ్రామా.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముంబై: చదువుకోమని తల్లి మందలించటంతో ఓ 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నాగ్‌పూర్ నుంచి పక్క జిల్లా చంద్రాపూర్‌కు వెళ్లిన బాలిక తాను కిడ్నాప్‌కు గురయ్యానని ఓ కట్టుకథ అల్లింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. కేసు వివరాలను ఆదివారం వెల్లడించారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ జిల్లాలోని నందన్వన్ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. బస్సులో 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్‌కు సాయంత్రానికి చేరుకుంది. తమ కూతురు కనిపించకపోవటంతో ఆమె కోసం వెతకటం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. ఆచూకీ లభించకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు.. చంద్రాపూర్ చేరుకున్న బాలిక నేరుగా రామ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి కారులో చంద్రాపూర్‌కు తీసుకొచ్చినట్లు చెప్పింది. వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు కట్టుకథ అల్లింది. బాలిక తెలిపిన వివరాలతో నాగ్‌పూర్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు చంద్రాపూర్ పోలీసులు. ఆ తర్వాత వారికి అప్పగించారు. నాగ్‌పూర్‌లోని నందన్వన్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. బాలిక తానే బస్సు ఎక్కి చంద్రాపూర్ వెళ్లినట్లు తేలింది. ఈ వీడియోను చూపించి ప్రశ్నించగా.. తన తల్లి చదువుకోవాలని మందలించటం వల్లే ఇలా చేశానని అంగీకరించింది. ఇదీ చదవండి: ‘సూపర్ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్ -
కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మోడల్
కిడ్నాప్ ప్రయత్నం నుంచి ఓ మోడల్ తృటిలో తప్పించుకుంది. తనను ఎత్తుకెళ్లిపోవాలని చూసేవారి నుంచి తప్పించుకోడానికి ఆమె కదులుతున్న కారులోంచి దూకేసింది. దాంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తన మాజీ బోయ్‌ఫ్రెండు, అతడి స్నేహితులు కలిసి తనను తీసుకెళ్లిపోయేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. తాను అతడితో బ్రేకప్ అయిపోవడంతో కక్ష తీర్చుకోడానికే ఇలా చేశారంది. అంతేకాక, తన ముఖం మీద యాసిడ్ పోయడానికి కూడా ప్రయత్నించినట్లు చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయిఏత ఇంతవరకు ఎవరినీ అరె స్టు చేయలేదు. ఉదయం 9 గంటలకు ఆమె తన స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఇద్దరు ముగ్గురు పురుషులు ఆమెను కారులోంచి బయటకు లాగి, బలవంతంగా తమ కారులోకి తోసేశారు. ఆమెను తీవ్రంగా కొడుతూ ముఖం మీద యాసిడ్ పోస్తామని బెదిరించారు. వాళ్లలో ఒకరిపేరు ఆమిర్ అని, మరొకరు అతడి స్నేహితుడు తయ్యాబ్ అని ఆమె చెప్పింది. ఆమిర్‌తో తాను బ్రేకప్ అవ్వడంతో వాళ్లు ఇలా చేశారని తెలిపింది.