రూ.30.60 లక్షలకు ఐపీ
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: ఖమ్మం నగరంలోని బుర్హాన్‌పురానికి చెందిన ప్రయివేటు వాహన డ్రైవర్ మద్దినేని వెంకటేశ్వర్లు అలియాస్ బొబ్బా 30.60లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం దివాళ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
మద్దినేని వెంకటేశ్వర్లు తన కుటుంబ అవసరాలకు ఆదాయం చాలకపోవడంతో భార్య ద్వారా ఇంటి వద్దనే చీరల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆమె కొందరి (పతివాదులు) వద్ద చిట్టీలలో సభ్యురాలిగా చేరింది. ఆ చిట్టీలను ఆమె పాడి నగదు తీసుకుంది. ఈ చిట్టీల వాయిదాలు చెల్లించేందుకు మరోచోట (చిట్టీలు) పాడుకుంది. ఇంతలో, చీరల వ్యాపారంలో ఒడుదుడుకులతో నష్టపోయింది. అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడడం, రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో మద్దినేని వెంకటేశ్వర్లు అలియాస్ బొబ్బా.. 30.60లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం దివాళ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాదిగా కిలారు లక్ష్మీనరసింహారావు వ్యవహరిస్తున్నారు.