సిరంజీలతో పెయింటింగ్...
కింబర్లి జాయ్ మగ్బాను ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ మహిళ నర్స్‌గా పనిచేస్తోంది. ఆమె పెయింటింగ్‌లో ఎప్పుడూ శిక్షణ తీసుకోనప్పటికీ అందులో మంచి ప్రావీణ్యం సంపాదించింది. తన వృత్తిలో బిజీగా గడపడంవల్ల తన ప్రవృత్తికి సమయం కేటాయించలేకపోయింది. అయితే తనకెంతో ఇష్టమైన ప్రవృత్తిని వదులుకోలేక గతేడాది సిరంజీలతో పెయింటింగ్ చేయడం అలవర్చుకుంది. రోగులకు ఒకసారి ఇంజెక్షన్ చేసిన తర్వాత సిరంజీలను పక్కన పడేయాలి. అలాంటి వాటిని వేస్ట్‌గా పడేయడం కంటే పెయింటింగ్ బ్రష్‌గా ఉపయోగిస్తే బాగుంటుందనిపించింది. అనుకున్నదే తడవుగా ఆ పనిని ప్రారంభించేసింది.
తొలుత సిరంజీలతో చిత్రాలు సరిగా రాకున్నప్పటికీ మళ్లీమళ్లీ ప్రయత్నించింది. రానురాను పెయింటింగ్స్ అద్భుతంగా రావడం మొదలుపెట్టా యి. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాలు వేసింది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో కింబర్లీ సెలబ్రిటీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. తొలుత కాన్వాస్‌పై బొమ్మ అవుట్‌లైన్‌ను పెన్సిల్‌తో గీస్తుంది. చక్కని విజువల్ ఎఫెక్ట్ కోసం బ్యాక్‌గ్రౌండ్ మొత్తానికీ నల్లటి రంగు పూస్తుంది. ఆ తర్వాత వివిధ రంగులతో నిండిన సిరంజీలను ఉపయోగించి బొమ్మను పూర్తి చేస్తుంది. అలా ఒక బొమ్మను గీయడానికి తనకి మూడు నుంచి ఐదు గంటలు పడుతుందని చెబుతోంది.