Kitchen Sets Modern Kitchen
-
సింగిల్ స్విచ్‌తో పూటకో వెరైటీ వండివాడ్చేస్తాయి.. సరసమైన ధరల్లోనే..
రోబోటిక్ గ్రిల్ ‘సింగిల్ స్విచ్‌తో పూటకో వెరైటీ ’ అనే పద్ధతికి ఈ ఉరుకుల పరుగుల జీవితాలు బాగా అలవాటు పడిపోయాయి. వంటకు గరిటెతో పని లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే అసలు మనిషి పక్కనుండాల్సిన అవసరమే లేదు. స్విచ్ ఆన్ చేసి వెళ్తే.. ఏ వేళలో వడ్డించుకున్నా.. వేడివేడిగా అందించడం నేటి టెక్నాలజీ స్పెషల్. చిత్రంలోని ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ ఫ్రైయర్ మెషిన్.. గుండ్రంగా తిరుగుతూ క్రిస్పీ రుచులను అందిస్తుంది. గాడ్జెట్లోపల బౌల్ 360 డిగ్రీలు తిరుగుతూ ఆహారాన్ని ఫ్రై చేస్తుంది. ఇంటెలిజెంట్ నాన్‌స్టిక్ డ్రమ్ కలిగిన ఈ రోబోటిక్ మేకర్లో ఒకేసారి ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఐదు అరలతో కూడిన పార్టిషన్ గ్రిల్ ప్లేట్.. ఈ మేకర్‌తో పాటు లభిస్తుంది. దాన్ని సెట్ చేసి ఒక్కోదానిలో ఒక్కో రకం ఐటమ్‌ని చిత్రంలో ఉన్న విధంగా గ్రిల్ చేసుకోవచ్చు. ఒకే రకాన్ని ఎక్కువ మోతాదులో వండుకోవాలనుకుంటే పార్టీషన్‌ను తీసేసే సౌకర్యమూ ఉంది. ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. దాన్ని గాడ్జెట్‌కి ఇరువైపులా లాక్ చేసుకునే వీలుంటుంది. గాడ్జెట్ పైభాగంలో ఆప్షన్స్‌తో కూడిన రెగ్యులేటర్ ఉంటుంది. వెనుక వైపు కింది భాగంలో వ్యర్థాలు చేరే ట్రే ఉంటుంది. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! ధర: 181 డాలర్లు (రూ.13,640) పోర్టబుల్ అవుట్ డోర్ గ్రిల్ ఇంట్లో ఉన్నప్పుడు పవర్ సాయంతో నడిచే మేకర్స్ సరే.. కానీ పిక్నిక్స్, హైకింగ్, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ సేవలు అందిపుచ్చుకోవడం ఎలా? ఆ సమస్యకు పరిష్కారమే ఈ అవుట్ డోర్ చార్కోల్ గ్రిల్. ఒక సూట్ కేస్లా వెంట తీసుకుని వెళ్లి.. అవసరమైనప్పుడు గ్రిల్ ప్లేట్స్‌ను చిత్రంలో చూపిన విధంగా అమర్చుకుని.. బొగ్గులపై క్రిస్పీ రుచులను తయారుచేసుకోవచ్చు. హైక్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్ తుప్పు పట్టదు. దీన్ని పట్టుకున్నప్పుడు చేతులు గీసుకోకుండా, బట్టల్లోని దారపు పోగులను లాగకుండా అన్ని అంచులు చక్కగా పాలిష్ చే సి ఉంటాయి. ఇందులో ఒకేసారి ఇద్దరి నుంచి ఐదుగురికి సరిపడే ఆహారాన్ని తయారుచేసుకోవచ్చు. ధర: 34 డాలర్లు (రూ.2,562) మల్టీఫంక్షన్ బ్రేక్‌ఫాస్ట్ మేకర్ చిత్రాన్ని చూసి ఇదేదో హ్యాండ్ బ్యాగ్ అనుకునేరు! కాదు కాదు. ఇదో బ్రేక్‌ఫాస్ట్ మేకర్. అవును.. శాండ్విచ్, బ్రెడ్ టోస్ట్, వాఫిల్స్, గుంత పొంగనాలు ఇలా చాలా రుచులను నిమిషాల్లో అందించగలిగే కుక్వేర్. ఒకరిద్దరికి సరిపడే పరిమాణంలో చాలా వెరైటీలను ఇందులో తయారుచేసుకోవచ్చు. ఈ మేకర్‌తో పాటు ఒక జత గ్రిల్ ప్లేట్స్, మరో జత వాఫిల్స్ ప్లేట్స్, రెండు గుంతపొంగనాల ప్లేట్స్ లభిస్తాయి. అవి డీప్ నాన్–స్టిక్ కోటింగ్ ప్లేట్స్ కావడంతో.. మెషిన్‌కి అటాచ్ చేయడం, వేరు చేయడం చాలా సులభం. ఇక దీనిపైన చికెన్, ఫిష్, రొయ్యలు వంటివీ గ్రిల్ చేసుకోవచ్చు. కట్లెట్స్, కబాబ్స్ లాంటివీ వండుకోవచ్చు. మెషిన్ ఆన్ అయిన తర్వాత రెడ్ లైట్ పవర్ ఆన్ని సూచిస్తుంది. ఇది లైట్ వెయిట్ కావడంతో ఉపయోగించడం చాలా తేలిక. ధర: 214 డాలర్లు (రూ.16,127) చదవండి: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! -
అబ్బురపరిచే వంటిల్లు
ఒకప్పుడు నాలుగు పాత్రలు, పొయ్య ఉంటే చాలు వంటావార్పు సిద్ధమయ్యేది. అయితే రానురానూ వంటల తయారీ కంటూ ప్రత్యేకంగా ఇళ్లల్లో గది ఏర్పాటు చేసుకోవడం మొదలెట్టారు. ఇక, ఈ ఆధునిక యుగంలో అంటారా.. అనేక ఇళ్లల్లో మోడరన్ కిచెన్లు దర్శనమిస్తున్నాయి. బహుళ అంతస్తుల ప్లాట్లు, విల్లాలు, డూబ్లెక్స్ల నిర్మాణాలు పెరగడంతో పాటుగా సొంత ఇంటితో పాటు తమ వంట గదిని ప్రత్యేకంగా తీర్చిదిద్దేస్తున్నారు. ఇలాంటి వారిని పరిగణనలోకి తీసుకున్న అనేక సంస్థలు వినియోగ దారుల అభిరుచులకు తగ్గట్టుగా మోడరన్ కిచెన్స్‌ను నగర వాసుల ముంగిటకు తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటైనవే మోడరన్ కిచెన్ స్టోర్లు . ఇందులో వంటల తయారికి ఉపయోగించే అన్ని రకాల పాత్రలు, కిచెన్ సెట్స్, అత్యాధునిక టెక్నాలజీతో తయారీచేసిన అన్ని రకాల వసతులు, సామగ్రితో కూడిన కిచెన్‌ను వినియోగదారుల అభిరుచుల్ని తలదన్నె రీతిలో, ఆకర్షించే విధంగా కొలువు దీరుస్తున్నారు. వంద శాతం స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారుచేసిన అన్ని రకాల చిన్న, పెద్ద వస్తువుల్ని ఇక్కడ కొలువు దీర్చామని ఆయా సంస్థల సీఈవోలు వివరిస్తున్నారు. కిచెన్‌తో పాటుగా, గృహోపకరణలు, అలంకరణలు, బెడ్స్, ఫొటో ఫ్రెమ్ల, ఫ్లవర్ వాజ్స్లను విక్రయాలకు ఉంచుతున్నారు. మోడరన్ కిచెన్‌లో అన్ని రకాల వస్తువులు, వంటకు ఉపయోగించి ప్రతి పాత్ర అత్యాధునిక హంగులతో, సరికొత్త స్టైల్స్‌తో తయారు చేస్తున్నారు. ప్రధానంగా రాజు ల కాలంలోని పాత్రల్ని తలపించే విధంగా ఎన్నో పాత్రలను అత్యంత ఆకర్షణీయంగా రూపొందిం స్తుండడం గమనార్హం. అలాగే, మోడరన్ కిచెన్ ఏర్పాటు నిమిత్తం తమను సంప్రదిస్తే, వినియోగదారుల అభిరుచుల్ని తలదన్నే విధంగా వారి ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాల వద్దకు వెళ్లి మరీ సిద్ధం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. - బెంగళూరు