ఒకప్పుడు నాలుగు పాత్రలు, పొయ్య ఉంటే చాలు వంటావార్పు సిద్ధమయ్యేది. అయితే రానురానూ వంటల తయారీ కంటూ ప్రత్యేకంగా ఇళ్లల్లో గది ఏర్పాటు చేసుకోవడం మొదలెట్టారు. ఇక, ఈ ఆధునిక యుగంలో అంటారా.. అనేక ఇళ్లల్లో మోడరన్ కిచెన్లు దర్శనమిస్తున్నాయి. బహుళ అంతస్తుల ప్లాట్లు, విల్లాలు, డూబ్లెక్స్‌ల నిర్మాణాలు పెరగడంతో పాటుగా సొంత ఇంటితో పాటు తమ వంట గదిని ప్రత్యేకంగా తీర్చిదిద్దేస్తున్నారు. ఇలాంటి వారిని పరిగణనలోకి తీసుకున్న అనేక సంస్థలు వినియోగ దారుల అభిరుచులకు తగ్గట్టుగా మోడరన్ కిచెన్స్‌ను నగర వాసుల ముంగిటకు తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటైనవే మోడరన్ కిచెన్ స్టోర్లు . ఇందులో వంటల తయారికి ఉపయోగించే అన్ని రకాల పాత్రలు, కిచెన్ సెట్స్, అత్యాధునిక టెక్నాలజీతో తయారీచేసిన అన్ని రకాల వసతులు, సామగ్రితో కూడిన కిచెన్‌ను వినియోగదారుల అభిరుచుల్ని తలదన్నె రీతిలో, ఆకర్షించే విధంగా కొలువు దీరుస్తున్నారు. వంద శాతం స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారుచేసిన అన్ని రకాల చిన్న, పెద్ద వస్తువుల్ని ఇక్కడ కొలువు దీర్చామని ఆయా సంస్థల సీఈవోలు వివరిస్తున్నారు.
కిచెన్‌తో పాటుగా, గృహోపకరణలు, అలంకరణలు, బెడ్స్, ఫొటో ఫ్రెమ్‌ల, ఫ్లవర్ వాజ్స్‌లను విక్రయాలకు ఉంచుతున్నారు. మోడరన్ కిచెన్‌లో అన్ని రకాల వస్తువులు, వంటకు ఉపయోగించి ప్రతి పాత్ర అత్యాధునిక హంగులతో, సరికొత్త స్టైల్స్‌తో తయారు చేస్తున్నారు. ప్రధానంగా రాజు ల కాలంలోని పాత్రల్ని తలపించే విధంగా ఎన్నో పాత్రలను అత్యంత ఆకర్షణీయంగా రూపొందిం స్తుండడం గమనార్హం. అలాగే, మోడరన్ కిచెన్ ఏర్పాటు నిమిత్తం తమను సంప్రదిస్తే, వినియోగదారుల అభిరుచుల్ని తలదన్నే విధంగా వారి ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాల వద్దకు వెళ్లి మరీ సిద్ధం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. - బెంగళూరు
అబ్బురపరిచే వంటిల్లు
Published Sun, Feb 22 2015 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement