కొత్తవాళ్లను ప్రోత్సహించాలి
- కె.ఎల్. దామోదర్ ప్రసాద్
‘‘తెలుగు ఇండస్ట్రీకి కొత్త నిర్మాతల అవసరం చాలా ఉంది. ప్రస్తుతం ఉన్న నిర్మాతలు వాళ్ల ఆలోచనా విధానాన్ని మార్చుకుని కొత్తవాళ్లని ప్రోత్సహించాలి’’ అని నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్ జంటగా ఎస్ఎస్ రవికుమార్ దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి నిర్మించిన ‘మిస్టర్ 420’ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వరుణ్ సందేశ్ చేసిన గత చిత్రాలకు భిన్నంగా ఉండే చిత్రం ఇది’’ అని తెలిపారు.
‘‘ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. సంగీత దర్శకుడు ముస్తఫా, కథానాయిక ప్రియాంకా భరద్వాజ్ తదితరులు మాట్లాడారు.