కీలుకు మేలు ఫలితాలు!
ఫలితాలు!
టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో నూటికి నూరుశాతం సత్ఫలితాలుంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు. సాధారణంగా ఈ సర్జరీ యాభై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్ల వయసు వరకు చేస్తుంటారు. అయితే ఈ ఆపరేషన్ ఏ వయసులో చేయవచ్చనే దానికి కూడా ఇదమిత్థంగా నిబంధనలేమీ లేవు. పేషెంటులో ఎముక క్షీణత, కీలు అరుగుదలను బట్టి ఏ వయసు వారికైనా చేయవచ్చు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ అవసరాన్ని సూచిస్తారు. జువైనల్ ఆర్థరైటిస్ కారణంగా టీనేజ్‌లో కూడా ఈ అవసరం ఏర్పడవచ్చు.
మోకాలి నిర్మాణం ఇలా!
దేహంలో ఉంటే కీళ్లన్నింటిలో మోకాలి కీలు చాలా పెద్దది, సంక్లిష్టమైన నిర్మాణం కూడ. తొడ ఎముక కింది భాగానికి, పిక్క ఎముక పై భాగానికి మధ్య పటెల్లా (మోకాలి చిప్ప)తో కప్పి ఉంటుంది మోకాలి నిర్మాణం. పటెల్లా కింద ఈ మూడు ఎముకల మధ్య కార్టిలేజ్ ఉంటుంది. కీలును కదిలించినప్పుడు ఎముకల చివర్లు ఒకదానితో మరొకటి ఒరుసుకు పోకుండా కందెనలా ఉంటుంది ఈ కార్టిలేజ్. కీళ్ల నిర్మాణంలో రెండు ఎముకలను కలిపి ఉంచే లిగమెంట్ చాలా ముఖ్యమైనది. తొడ- పిక్క ఎముకలను పట్టి ఉంచే ఈ లిగమెంట్ దేహంలోని లిగమెంట్లన్నింటిలోకి పెద్దది.
ఈ వ్యవస్థ మొత్తాన్ని సినోవియల్ మెంట్రేన్ చుట్టి ఉంటుంది. ఇది మోకాలు సులువుగా కదలడానికి అవసరమైన ద్రవాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ ఐకమత్యంగా పని చేస్తున్నంత కాలం మోకాలి కీలుకు సమస్యలు ఉండవు. గాయాలు, వార్ధక్యం, కొన్ని ఇతర కారణాల వల్ల మోకాలి భాగాల పని తీరులో ఐకమత్యం లోపిస్తుంది. అప్పుడే వాపు, నొప్పి, కీళ్లు కదిలించలేకపోవడం... వంటి సమస్యలు తలెత్తుతాయి.
• రెండేళ్ల మనుమడు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు.
• కుర్చీ పట్టుకుని లేచి నిలుచున్నాడు... మనవడిని మురిపెంగా చూస్తోంది రాజ్యలక్ష్మి.
• అది ఫైబర్ కుర్చీ... కదిలిపోయింది. పిల్లాడికి పట్టు తప్పుతోంది.
• కంగారుగా లేవబోయిందామె. అంతే... మోకాలి కీళ్లు పటపటమంటూ శబ్దం చేశాయి. కళ్లవెంట నీళ్లు పడేటంతటి బాధను అదిమిపట్టి అడుగు ముందుకు వేసేలోపే పిల్లాడు కిందపడిపోయాడు. అయ్యో! అంటూ పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని సముదాయిస్తోంది.
• ఈ మోకాళ్ల నొప్పులు లేకపోతే చక్కగా మనవడి ఆలనపాలన చూసుకునేది కదా అని బాధపడుతోందామె.
• యాభై ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమైన సమస్య. మోకాలి నొప్పి మొదట్లో మందులతో తగ్గుతుంటుంది. క్రమంగా అది మందులకు మాట వినని స్థితికి చేరుతుంది. అప్పుడిక ప్రత్యామ్నాయం నీ రీప్లేస్మెంట్ సర్జరీ మాత్రమే అంటారు నిపుణులు. అత్యంత క్లిష్టమైన బాధ ఈ చికిత్సతో మటుమాయం అవుతోంది.
మరుసటి రోజే నడవవచ్చు!
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. సర్జరీ చేసిన మరసటి రోజు నుం నడవవచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్ చేయకముందే బెడ్ మీద నుంచి లేచి బాత్రూముకి వెళ్లడం, పనులు సొంతంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మరే ఇతర సమస్యలు రావని వైద్యులు చెప్తున్నారు. అయితే నీ రీప్లేస్మెంట్సర్జరీ ఒక్కటే కాదు, ఏ ఇతర సర్జరీ చేసుకున్నప్పుడైనా తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు... అంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు ఇక్కడ కూడా పాటించాల్సిందే. ఇందులో ప్రత్యేకంగా బ్లడ్‌క్లాట్ ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కార్టిలేజ్‌లో గడ్డకట్టిన రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంటుంది. అందుకోసం ముందుగానే రక్తం పలుచబడడానికి మందులిస్తారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో, నాణ్యమైన వైద్యసేవలు, పరికరాలు ఉన్న వైద్యశాలలో ఈ సర్జరీని విజయవంతంగా చేయడం సాధ్యమే.
టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో నూటికి నూరుశాతం సత్ఫలితాలుంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు. సాధారణంగా ఈ సర్జరీ యాభై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్ల వయసు వరకు చేస్తుంటారు. అయితే ఈ ఆపరేషన్ ఏ వయసులో చేయవచ్చనే దానికి కూడా ఇదమిత్థంగా నిబంధనలేమీ లేవు. పేషెంటులో ఎముక క్షీణత, కీలు అరుగుదలను బట్టి ఏ వయసు వారికైనా చేయవచ్చు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ అవసరాన్ని సూచిస్తారు. జువైనల్ ఆర్థరైటిస్ కారణంగా టీనేజ్‌లో కూడా ఈ అవసరం ఏర్పడవచ్చు.
మోకాలి నిర్మాణం ఇలా!
దేహంలో ఉంటే కీళ్లన్నింటిలో మోకాలి కీలు చాలా పెద్దది, సంక్లిష్టమైన నిర్మాణం కూడ. తొడ ఎముక కింది భాగానికి, పిక్క ఎముక పై భాగానికి మధ్య పటెల్లా (మోకాలి చిప్ప)తో కప్పి ఉంటుంది మోకాలి నిర్మాణం. పటెల్లా కింద ఈ మూడు ఎముకల మధ్య కార్టిలేజ్ ఉంటుంది. కీలును కదిలించినప్పుడు ఎముకల చివర్లు ఒకదానితో మరొకటి ఒరుసుకు పోకుండా కందెనలా ఉంటుంది ఈ కార్టిలేజ్. కీళ్ల నిర్మాణంలో రెండు ఎముకలను కలిపి ఉంచే లిగమెంట్ చాలా ముఖ్యమైనది.
తొడ- పిక్క ఎముకలను పట్టి ఉంచే ఈ లిగమెంట్ దేహంలోని లిగమెంట్లన్నింటిలోకి పెద్దది. ఈ వ్యవస్థ మొత్తాన్ని సినోవియల్ మెంట్రేన్ చుట్టి ఉంటుంది. ఇది మోకాలు సులువుగా కదలడానికి అవసరమైన ద్రవాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ ఐకమత్యంగా పని చేస్తున్నంత కాలం మోకాలి కీలుకు సమస్యలు ఉండవు. గాయాలు, వార్ధక్యం, కొన్ని ఇతర కారణాల వల్ల మోకాలి భాగాల పని తీరులో ఐకమత్యం లోపిస్తుంది. అప్పుడే వాపు, నొప్పి, కీళ్లు కదిలించలేకపోవడం... వంటి సమస్యలు తలెత్తుతాయి.
• రెండేళ్ల మనుమడు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు.
• కుర్చీ పట్టుకుని లేచి నిలుచున్నాడు... మనవడిని మురిపెంగా చూస్తోంది రాజ్యలక్ష్మి.
• అది ఫైబర్ కుర్చీ... కదిలిపోయింది. పిల్లాడికి పట్టు తప్పుతోంది.
• కంగారుగా లేవబోయిందామె. అంతే... మోకాలి కీళ్లు పటపటమంటూ శబ్దం చేశాయి. కళ్లవెంట నీళ్లు పడేటంతటి బాధను అదిమిపట్టి అడుగు ముందుకు వేసేలోపే పిల్లాడు కిందపడిపోయాడు. అయ్యో! అంటూ పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని సముదాయిస్తోంది.
• ఈ మోకాళ్ల నొప్పులు లేకపోతే చక్కగా మనవడి ఆలనపాలన చూసుకునేది కదా అని బాధపడుతోందామె.
• యాభై ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమైన సమస్య. మోకాలి నొప్పి మొదట్లో మందులతో తగ్గుతుంటుంది. క్రమంగా అది మందులకు మాట వినని స్థితికి చేరుతుంది. అప్పుడిక ప్రత్యామ్నాయం నీ రీప్లేస్మెంట్ సర్జరీ మాత్రమే అంటారు నిపుణులు. అత్యంత క్లిష్టమైన బాధ ఈ చికిత్సతో మటుమాయం అవుతోంది.
మరుసటి రోజే నడవవచ్చు!
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. సర్జరీ చేసిన మరసటి రోజు నుం నడవవచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్ చేయకముందే బెడ్ మీద నుంచి లేచి బాత్రూముకి వెళ్లడం, పనులు సొంతంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మరే ఇతర సమస్యలు రావని వైద్యులు చెప్తున్నారు. అయితే నీ రీప్లేస్మెంట్సర్జరీ ఒక్కటే కాదు, ఏ ఇతర సర్జరీ చేసుకున్నప్పుడైనా తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు... అంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు ఇక్కడ కూడా పాటించాల్సిందే.
ఇందులో ప్రత్యేకంగా బ్లడ్‌క్లాట్ ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కార్టిలేజ్‌లో గడ్డకట్టిన రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంటుంది. అందుకోసం ముందుగానే రక్తం పలుచబడడానికి మందులిస్తారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో, నాణ్యమైన వైద్యసేవలు, పరికరాలు ఉన్న వైద్యశాలలో ఈ సర్జరీని విజయవంతంగా చేయడం సాధ్యమే.
సర్జరీకి దారి తీసే కారణాలు
మోకాలి సమస్యల్లో ఎక్కువగా కనిపించేది ఆర్థరైటిస్. మోకాలిని కదిలించాలంటే భయపడేటంత నొప్పి ఉంటుంది. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని మూడు రకాలుంటాయి.
1. ఆస్టియో ఆర్థరైటిస్ కార్టిలేజ్ పటుత్వం లోపించడం వంటి మార్పులు వయసు పై బడిన వారిలో వస్తుంటాయి. ఎముకల మధ్య కుషన్ తగ్గిపోవడంతో ఎముకలు ఒరిపిడి లోనయి నొప్పి, కీళ్లు బిగుసుకు పోవడం కనిపిస్తుంటాయి. ఈ సమస్య సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. ముప్పై ఏళ్లలో కూడా కనిపిస్తుంటుంది. కానీ ఇది చాలా తక్కువ శాతం.
2. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇది ఒక వ్యాధి. సినోవియల్ మెంబ్రేన్ స్రావాల విడుదల తగ్గడం, పలుచగా ఉండాల్సిన ద్రవం చిక్కబడడం వంటి మార్పులు సంభవిస్తాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే కార్టిలేజ్ కార్టిలేజ్ క్షయానికి గురయ్యి కీళ్లలో నొప్పి, వాపు వస్తాయి. కీళ్లలో వాపుకు సంబంధించిన అనేక సమస్యలలో ఎక్కువగా కనిపించేది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్.
3. పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్: ఇది ప్రమాదవశాత్తూ గాయాలపాలయినప్పుడు మోకాలి ఎముకలు చిట్లడం, విరగడం, మోకాలి కీలులోని లిగమెంట్ వంటి భాగాలు చీరుకు పోవడం వంటివి సంభవిస్తుంటాయి. అలాంటప్పుడు కూడా వాపు, నొప్పితోపాటు కీలు కదలించడం కష్టమవుతుంది.
చికిత్స: ఎముకను ప్రిపేర్ చేయడం: కార్టిలేజ్‌లో డ్యామేజ్ అయిన భాగాన్ని, ఫెముర్ బోన్, టిబియా బోన్ల చివర్ల పొరలను తొలగిస్తారు మెటల్ ఇంప్లాంట్స్ అమరిక: తొలగించిన కార్టిలేజ్, ఎముక చివర్ల పరిమాణానికి తగినట్లు, మోకాలి కీలులో సరైన కొలతలతో లోహపు కీలును తయారు చేసి అమర్చడం రీసర్ఫేస్: మోకాలి చిప్ప లోపలి పొరను సరిచేసి ప్లాస్టిక్ బటన్ అమర్చడం. ఇది కొన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీలకు మాత్రమే అవసరం ఇన్సర్ట్ ఎ స్పేసర్: ఇది లోహపు భాగాల మధ్య కదలికను సులువు చేస్తుంది.
• టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా అరుదుగా చేస్తారు. మోకాలు పూర్తిగా వంగిపోవడం, దేహం బరువును మోయలేక మోకాలి వంపుతోపాటు కాళ్లు విల్లుగా వంగడం వంటి పరిస్థితుల్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరమవుతుంది. అలాగే...
• భరించలేని మోకాలి నొప్పి, కీళ్లు బిగుసుకుపోవడంతో నడవడం, మెట్లెక్కడం, కుర్చీలో నుంచి ఉన్న ఫళాన లేవలేకపోవడం, రోజువారి పనులు చేసుకోలేనప్పుడు కర్ర లేదా వాకర్ సాయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో పడుకుని లేచేటప్పుడు కీళ్లు బిగుసుకుపోయి మంచం మీద లేవడానికి ప్రయాసపడడం మందులతో చెప్పుకోదగినంత ఉపశమనం పొందలేనప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కార్టిజోన్ ఇంజెక్షన్లు, లూబ్రికేషన్ పెంచే ఇంజక్షన్లు, ఫిజికల్ థెరపీ, ఇతర ఆపరేషన్లతో సాంత్వన దక్కనప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం అవుతుంది.
ముందస్తు పరీక్షలు!
ఆర్థోపెడిక్ సర్జన్ కింది అంశాలను నిర్ధారించుకున్న తర్వాత నీ రీప్లేస్మెంట్ సర్జరీకి అనుమతిస్తారు. మెడికల్ హిస్టరీ: పేషెంట్ సాధారణ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవడం... అంటే బీపీ, డయాబెటిస్, గుండె వ్యాధులు, మరేదైనా ఇతర వ్యాధులకు మందులు వాడుతుండడం వంటివి ఫిజికల్ఎగ్జామినేషన్: దీని ద్వారా మోకాలి కదలికను, పటుత్వాన్ని, ఎముక గట్టిదనాన్ని, మొత్తంగా కాలి పరిస్థితిని అంచనా వేస్తారు ఎక్స్-రే: ఈ పరీక్ష ద్వారా ఎముక క్షీణత, కార్టిలేజ్ డ్యామేజ్, ఇతర డిఫార్మిటీలు తెలుస్తాయి. వీటితోపాటు బ్లడ్ టెస్ట్, ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా మోకాలి ఎముకను ఆనుకుని ఉండే మెత్తటి టిస్యూల స్థితి తెలుస్తుంది.