క్రేజీకల్చర్ను పరిశీలించిన జపాన్ మహిళ
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో ఉన్న కొంగల ట్యాంకు, కొంగువారిగూడెంలో ఉన్న క్రేజీ కల్చర్‌ను జపాన్ దేశానికి చెందిన ఒక మహిళ గురువారం సందర్శించారు. మత్స్యకారుల జీవన విధానం, వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యశాఖ అధికారులు భాష విషయంలో జపాన్ మహిళకు సహకరించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డీడీ యాకుబాషా, ఏడీ రామకృష్ణంరాజు, ఏఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.