Kodambakam
-
కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన మమత
చెన్నై: కరుణానిధి ప్రథమ వర్థంతి సందర్భంగా బుధవారం తమిళనాడుకి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడంబాక్కంలోని మురసొలి కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి సీఎం వి. నారాయణసామి తదితరులు హాజరయ్యారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాల్సి ఉన్నా, చివరి నిమిషంలో రాలేకపోయారని తెలిపారు. ఫరూక్ అబ్దుల్లా తన కుమార్తె ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఏడుస్తున్న వీడియోనూ తాను నిన్న చూశానని మమతా పేర్కొన్నారు. కశ్మీర్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఆ వీడియోనే నిదర్శనమని వెల్లడించారు. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమని, ఒక రాష్ట్రంపై నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడం దారుణమని మమత విమర్శించారు. -
వచ్చే సమ్మర్‌కి... ఓకే... బంగారం
దర్శక - నిర్మాత మణిరత్నం ఇప్పుడు కొత్త సినిమా పనుల్లో ఉన్నారా? అవుననే అంటున్నాయి చెన్నైలోని కోడంబాకమ్ వర్గాలు. నగర వాతావరణం నేపథ్యంలో ప్రేమ, సహజీవనం, పెళ్ళి అంశాలతో ఆ మధ్య ‘ఓ.కె. బంగారం’ (తమిళ మాతృక ‘ఓ.కె. కాదల్ కన్మణి’) ద్వారా ఆయనకు మళ్ళీ మంచి హిట్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ ఆ చిత్రంలో హీరో. ఇప్పుడు తీయబోయే కొత్త సినిమాలో కూడా దుల్కర్ ఒక హీరో, సూర్య తమ్ముడు కార్తీ మరో హీరో. ఈ ఇద్దరు హీరోలతో తీసేది ముక్కోణపు ప్రేమకథా, లేక మరొకటా అన్నది మణి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఏ.ఆర్. రహమాన్ సంగీతం, రవి వర్మన్ ఛాయాగ్రహణం అందించే ఈ కొత్త సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయా లని మణిరత్నం ప్లాన్. ఆ మాట ఆయనే ఈ మధ్య లండన్‌లో వెల్లడిం చారు. సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో మణి మళ్ళీ వేగం పెంచినట్లున్నారు. శుభం.