koddamaram
-
రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం
-
రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: తెలంగాణలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయటం అప్రజాస్వామికమని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని జీవో నంబర్ 39 దెబ్బతీస్తుందన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు అధికారాలను కల్పిస్తూ తెచ్చిన రాజ్యాంగంలోని 73, 74 సవరణలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆరోపించారు. సమన్వయ సమితులు అధికార పార్టీ పెత్తనానికి వేదికగా ఉపయోగపడతాయన్నారు. రైతు సమన్వయ కమిటీలను రద్దు చేసే వరకు ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. -
చేనేతలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ కోదండరాం అనంతపురం సప్తగిరి సర్కిల్: చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. స్థానిక చేనేత కార్యాలయం ఎదుట బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేనేతలను ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నారన్నారు. చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే చేనేతలు లబ్ధిపొందుతున్నారన్నారు. చేనేతలకు భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. సిండికేట్ నగర్, ధర్మవరం, చిగిచెర్ల గ్రామస్థులు, నాగేంద్ర, సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.