రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం | Coordination sets are the platform for power of the ruling party | Sakshi
Sakshi News home page

రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం

Published Thu, Sep 7 2017 4:13 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం

రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం

టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయటం అప్రజాస్వామికమని టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని జీవో నంబర్‌ 39 దెబ్బతీస్తుందన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు అధికారాలను కల్పిస్తూ తెచ్చిన రాజ్యాంగంలోని 73, 74 సవరణలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆరోపించారు. సమన్వయ సమితులు అధికార పార్టీ పెత్తనానికి వేదికగా ఉపయోగపడతాయన్నారు. రైతు సమన్వయ కమిటీలను రద్దు చేసే వరకు ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement