kolkata woman
-
రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం!
ఆమె ఐఐటీ, ఐఐఎంలలో చదువుకోలేదు.. ఉన్నత స్థాయి సంపన్న కుటుంబం నుంచి రాలేదు.. తండ్రి పేద్ద వ్యాపారవేత్తేమీ కాదు.. అయినా ఆమె ఓ కంపెనీ స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది. ఆ యువతి స్ఫూర్తివంతమైన కథ మీ కోసం... ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! అంకితా నంది.. కోల్‌కతాకు చెందిన కంపెనీ టయర్ 5 టెక్నాలజీ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్. తన భర్తతో కలిసి 2015లో ఈ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ వ్యాపార సంస్థల కోసం కావాల్సిన సాంకేతిక ఆవిష్కరణలు, ఉత్పత్తులు అందిస్తుంది. ఈ కంపెనీకి ప్రస్తుతం కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో వందలాది మంది ఉద్యోగులతో కార్యాలయం ఉంది. ఆసక్తికర నేపథ్యం అంకితా నంది బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాకు చెందినవారు. ఆమెది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. పాఠశాల విద్యాభ్యాసం బెంగాలీ మీడియంలోనే పూర్తయింది. చిన్నతనం నుంచే సొంతంగా కంపెనీ పెట్టాలని కలలు కన్న ఆమె కాలేజీలో చదువుతున్నప్పడే సాఫ్ట్వేర్ తయారు చేయడం ప్రారంభించింది. ఆమె చదివింది స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలోనే. ఆమె తన స్నేహితులతో కలిసి ఆండ్రాయిడ్ అప్లికేషన్లను తయారు చేసి విక్రయించేవారు. వ్యాపారవేత్త కావాలనే ఆలోచన ఆమెకు అలా వచ్చిందే. అంకితా నందికి ఓ డేటింగ్ యాప్ ద్వారా అమెరికాకు చెందిన జోన్ వాన్తో పరిచయం ఏర్పడింది. ఆయన ఫ్లోరిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరూ 2021లో వివాహం చేసుకున్నారు. అయితే 2015లోనే వీరిద్దరూ కలిసి టయర్ 5 టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీని స్థాపించారు. 2021లో ఈ కంపెనీ విలువ 12 మిలియన్ డాలర్లు. అది ఇప్పుడు దాదాపు రూ. 100 కోట్లు. రెండు అద్దె కంప్యూటర్లు, ఇద్దరు ఉద్యోగులు అంకితా నంది కేవలం రెండు కంప్యూటర్లతో కంపెనీని ప్రారంభించారు. అవి కూడా అద్దె కంప్యూటర్లు. ప్రారంభంలో కంపెనీలో ఉన్నది ఇద్దరు ఉద్యోగులు మాత్రమే. ఒక డెవలపర్, ఒక హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. ఈ కంపెనీలో ఇప్పుడు 100 మందికి పైగా ఉద్యోగులు, 1500 మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం యూఎస్ఏలోని ఇండియానాలో ఉండగా భారత్‌లోని కోల్‌కతాలోనూ కార్యాలయం ఉంది. దాదాపు 25 సాఫ్ట్వేర్ ఉత్పత్తులను కంపెనీ అందిస్తోంది. కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగానికి అంకితా నంది నాయకత్వం వహిస్తున్నారు. తన ఎనిమిదేళ్ల కెరీర్లో అనేక ప్రశంసలు అందుకున్నారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
న్యూస్ మేకర్: జీవితం ఆమెతో ఫుట్‌బాల్ ఆడింది
మొన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మన పురుషుల టీం కనిపించిందా? పురుషుల టీమ్‌ను తయారు చేసుకోలేని మనం స్త్రీల టీమ్‌ను మాత్రం ఏం పట్టించుకుంటాం? అసలు ఫుట్‌బాల్ ఆడే అమ్మాయిలకు మన దేశంలో ఏం మర్యాద, ప్రోత్సాహం ఉన్నాయి? కోల్కటా ఫుట్‌బాల్ క్రీడాకారిణి పౌలమి అధికారి ఒకప్పుడు దేశ జట్టులో ఆడింది. ఇప్పుడు? జరుగుబాటు కోసం జొమాటో డెలివరి గర్ల్‌గా పని చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఈమె జీవిత అవస్థ గురించి సోషల్ మీడియాలో, మీడియాలో ఆవేదన వ్యక్తం అవుతోంది. జొమాటో అని రాసి ఉన్న ఎర్రటి టీ షర్ట్ తొడుక్కుని కోల్కటాలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్న 24 ఏళ్ల పౌలమి అధికారి ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి అని ఎవరూ ఊహించరు. గత కొంతకాలంగా ఇల్లు గడవడానికి పౌలమి ఫుడ్ డెలివరీ చేస్తోంది. కోల్కటాకే చెందిన సంజుక్త చౌధురి అని ట్విటర్ యూజర్ పౌలమి గురించి చిన్న వీడియో తీసి ట్విటర్లో ఉంచడంతో గత రెండు మూడు రోజుల్లోనే చాలా రెస్పాన్స్‌లు వచ్చాయి. విస్తృతంగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి నిస్సహాయ స్థితిలో ఉండటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అబ్బాయి అనుకునేవారు కోల్‌కటాలోని బెహలా ప్రాంతంలో నివసించే పౌలమి బాల్యంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటే మేనత్త పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచే పౌలమి ఫుట్‌బాల్ ఆడేది. అయితే అబ్బాయిలాగా కనిపించే పౌలమిని చూసి అందరూ అబ్బాయి అనుకుని ఆడించేవారు. ‘ఆ తర్వాత నేను అమ్మాయి అని తెలిశాక ఆటలో రానివ్వలేదు. అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడితే వారికి ఏ మర్యాద లేదు. నేను ఫుట్‌బాల్ మానేసి కొన్నాళ్లు హాకీ ఆడాను. అయితే మా ప్రాంతంలోని అనిత సర్కార్ అనే ఫుట్‌బాల్ కోచ్ నన్ను చూసి ఫుట్‌బాల్‌లో ట్రయినింగ్ ఇచ్చింది. నేను మంచి ప్లేయర్‌ని అయ్యాను’ అంటుంది పౌలమి. పదిహేను ఏళ్లు వచ్చేసరికే పౌలమి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయ్యింది. దేశం తరఫున అండర్ 16 జట్టుకు ఎంపికయ్యి 2013లో జరిగిన అండర్ 16 ఛాంపియన్షిప్ కోసం శ్రీలంక వెళ్లి ఆడింది. అయితే ఆ సమయంలో తగిలిన గాయాల నుంచి కోలుకోవడం కష్టమైంది. ఇంటివాళ్లుగాని, క్రీడా సంస్థలుగాని సరైన వైద్యం, ఫిట్నెస్ ట్రయినింగ్ ఇప్పించకపోవడంతో వెనుకబడింది. మళ్లీ కోలుకుని 2016లో జరిగిన స్ట్రీట్ ‘హోమ్‌లెస్ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్’ కోసం దేశం తరఫున గ్లాస్గో వెళ్లి ఆడింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఫుట్‌బాల్ అసోసియేషన్ నుంచి ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. వెంటాడిన పేదరికం 2017లో తండ్రి చేస్తున్న డ్రైవర్ ఉద్యోగం పోయింది. ఇంకో చెల్లెలు, తను తప్ప సంపాదనకు ఎవరూ లేరు. 2019 నాటికి బతకడం దుర్భరమైంది. ‘అప్పుడే నేను జొమాటోలో చేరారు. ఆ రోజుల్లో రోజుకు 500 సంపాదించేదాన్ని. లాక్డౌన్ ఎత్తేశాక చాలామంది ఈ ఉద్యోగంలోకి వచ్చారు. ఆర్డర్లు తక్కువ. పైగా నాకు సైకిల్ తప్ప బండి లేదు. దాంతో దగ్గరి ఆర్డర్లే తీసుకుంటాను. అందువల్ల రోజుకు 400 వస్తాయి. ఒక్కో ఆర్డర్ మీద 20 లేదా 30 రూపాయలు వస్తాయి. ఒక్కోసారి రోజుకు 300 రూపాయలకు మించి రావు. నాకు వేరే దారి లేదు... ఈ పని తప్ప’ అంది పౌలమి. రోజుకు 12 గంటలు పని చేస్తూ కూడా ఒక్కోసారి ఫుట్‌బాల్‌ను సాధన చేస్తుంటుంది పౌలమి. బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నదిగాని అది కూడా నత్తనడకన సాగుతున్నది. వెల్లువెత్తిన స్పందన పౌలమి కథనానికి స్పందన వెల్లువెత్తింది. దేశంలో ఫుట్‌బాల్ క్రీడాకారుల స్థితి ఆ మాటకొస్తే ఏ కొద్ది మందో తప్ప అందరు క్రీడాకారుల స్థితి ఇలాగే ఉందనే స్పందన వచ్చింది. ఫుట్‌బాల్ ఆటను ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నా పురుషులలోగాని, స్త్రీలలోగాని ప్రపంచ దేశాలతో తలపడే మెరుగైన టీమ్‌లు తయారు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ‘నాకు ఇప్పుడు కుదురైన ఉద్యోగం, ప్రాక్టీసు చేయడానికి మంచి స్పైక్స్ కావాలి’ అంటున్న పౌలమిలాంటి వారిని ఆ స్థితిలో ఉంచడం విషాదం. ఇప్పుడు వచ్చిన స్పందనతో ఆమెకు ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. -
Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం
‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్‌గా రాణిస్తుంది. ‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది. శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కోల్‌కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం. -
ఆమె లేదు.. ఆమె కళ్లు ఉన్నాయి!
కోల్‌కతా: పుట్టెడు విషాదంలోనూ తోటివారికి సహాయం చేయాలని భావించింది ఆ కుటుంబం. తమకు వచ్చిన కష్టం మరొకరికి రాకూదన్న ఉద్దేశంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాకు చెందిన సుతాప బోస్ అనే 36 ఏళ్ల మహిళ మంగళవారం కన్నుమూశారు. ఆమె అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే సమయం మించిపోవడంతో ఆమె అవయవాలు పనికిరాకుండా పోయాయి. ఆమె కళ్ల నుంచి కార్నియాలను మాత్రం వైద్యులు సేకరించారు. వీటితో ఇద్దరికి చూపు ప్రసాదించనున్నారు. పుట్టెడు బాధలోనూ పరులు కోసం ఆలోచించిన సుతాప కుటుంబ సభ్యులను చెమర్చిన కళ్లతోనే అభినందిస్తున్నారు. సుతాప రెండు కిడ్నీలు పాడైనట్టు ఏడాదిన్నర క్రితం డాక్టర్లు గుర్తించారు. ఆమెకు మూత్రపిండ్రం అమర్చాలని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటూ అవయవదాత కోసం ఆమె ఎదురు చూశారు. సుతాప కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆమెకు కిడ్నీ దొరకలేదు. బిరతిలో తన తండ్రి నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో సుతాప మంగళవారం కన్నుమూశారు. అంత బాధలోనూ సుతాప కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేయాలనుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని డాక్టర్ ప్రతిమ్ సేన్‌గుప్తా చెప్పారు. సుతాపకు భర్త అమితాబ, ఐదేళ్ల కుమార్తె శ్రేష్ట ఉన్నారు.