నేపాల్ మహిళ అదృశ్యం
నేపాల్‌కు చెందిన మహిళ అదృశ్యమైన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం....ఫలక్‌నుమా జహనుమా ఎం.టి. కాలనీకి చెంఇన అయేషా మహ్మద్ ఇంట్లో నేపాల్‌కు చెందిన హీరా కోమల్ బుదా(34) సర్వంట్‌గా కొనసాగుతోంది. కాగా గత నెల 29వ తేదీనా రాత్రి భోజనం అనంతరం అయేషా కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా కోమల్ కనిపించలేదు. దీంతో అయేషా ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.