కారుపై మృతదేహం.. 15 కి.మీ. ప్రయాణం..!
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద శనివారం రోడ్డు దాటుతున్న వృద్ధుడు కొమిరెల్లి వెంకట్రెడ్డి(65)ని హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రెడ్డి అమాంతం గాల్లోకి ఎగిరి అదే కారుపై పడి మృతి చెందాడు. కానీ, కారు డ్రైవర్ రహీంఖాన్ మాత్రం ఆ వాహనాన్ని ఆపకుండా 15 కిలోమీటర్ల దూరం అలాగే కారుపై మృతదేహంతోనే వెళ్లాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపుడే అయిటిపాముల వద్ద కారు రిపేర్తో ఆగిపోగా పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
- నార్కట్పల్లి