పథకం పన్నారు.. ప్రాణాలు తీశారు..
దంపతుల హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
కొడుకు, కోడలే సూత్రధారులు
వివరాలు వెల్లడించిన సీఐ
కేసముద్రం : ఆస్తి కోసం ఆమె బంధుత్వాన్ని మ రిచింది.. తమకు అడ్డుగా ఉన్న అత్తమామలను హతమార్చేందుకు కోడలు పథకం రూపొందిం చగా.. వారి కన్నకొడుకు, కోడలికి పరిచయము న్న వ్యక్తి ఈ ఘాతుకంలో పాలుపంచుకున్నారు. అయితే హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా ఉన్న కొడుకు, కోడలిని తమదైన శైలిలో పోలీ సులు విచారించగా వారు హత్యానేరాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు కేసముద్రం పోలీస్‌స్టేష న్ లో బుధవారం నిందితుల వివరాలను రూరల్ సీఐ కృష్ణారెడ్డి వెల్లడించారు. కేసముద్రం స్టేషన్ కు చెందిన రిైటె ర్డ్ టీచర్ గుడ్ల వెంకట్రామయ్య మొదటి భార్య ప్రమీలకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఆయన కొన్నేళ్ల క్రి తం ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు చేశారు. కాగా, పదేళ్ల క్రితం ప్రమీల తన తల్లిగారి ఊరైన పర్వతగిరి మండలంలోని కొంకపాకలో బావిలో పడి చని పోయింది. ఈ క్రమంలో ఏడాది తర్వాత కొడు కుకృష్ణకు నెక్కొండకు చెందిన కవితతో వివాహం జరిగింది.
అయితే కొడుకు పెళ్లైన ఏడాది తర్వాత వెంకట్రామయ్య తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పగా.. కొడుకు, కోడలు, బంధువులు ఒప్పుకోలేదు. అయినా వెంకట్రామయ్య ఫర్‌గఢ్ మండలంలోని కూనూరుకు చెందిన సరస్వతిని చేసుకున్నాడు. అనంతరం వెంకట్రామ య్య తన ఇంటి పై పోర్షన్‌ను కొడుకుకు ఇచ్చి, కింది పోర్షన్ తాను ఉంచుకున్నాడు. అలాగే ఇదే గ్రామశివారు బ్రహ్మంగారి తండా, వరంగల్ తిమ్మాపూర్‌లోని స్థలాలను పంపకాలు చేశాడు. అయితే తాను తెచ్చిన కట్నం వాడుకుంటున్నామని, పింఛన్లో తమకు సగం ఇవ్వాలని కవిత డిమాండ్ చేయగా వెంకట్రామయ్య చివరకు కొడుకుకు రూ.2 లక్షలు ఇచ్చాడు. దీంతో ఆయన బట్టలషాపు పెట్టుకున్నాడు.
ఆస్తి కోసం ఫిర్యాదు...
భూములు, ఇళ్లలో సగం వాటా ఇచ్చినప్పటికీ కొడుకు, కోడలు, మామల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 2005లో తండ్రి, కొడుకులు ఆస్తికోసం కొట్టుకోగా కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గతంలో చేసిన పంపకాలు రద్దు చేయాలని కొన్నేళ్ల క్రితం వెంకట్రామయ్య సబ్ రిజిస్టార్కు దరఖాస్తు చేయడంతోపాటు తిమ్మాపూర్‌లో ఉ న్న స్థలాన్ని మొత్తం అమ్ముకోవడంతో.. కొడుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తాను ఇక్కడ ఉండకూడదని భావించిన వెంకట్రామయ్య తాను ఉంటున్న కింది పోర్షన్‌ను అమ్మేందుకు ఒకరి నుంచి రూ.లక్ష అడ్వాన్స్ తీసుకున్నాడు. దీంతో కొడుకు, కోడలు.. వెంకట్రామయ్య, అతడి భార్య సరస్వతితో గొడవపడ్డారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఇరువురు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో రెండోభార్య స్వగ్రామమైన కూనూరులో శాశ్వతంగా ఉండటానికి వెంకట్రామయ్య నిర్ణయించుకుని అక్కడ ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. ఇంత లో రెండో భార్యకు కొడుకు(విష్ణు) పుట్టాడు. ఇదంతా గమనించిన కోడలు కవిత తమకు ఆస్తిదక్కకుండా చేసేందుకు అత్తామామలు కుట్రపన్నుతున్నారని ఆలోచనలో పడింది.
హత్యకు పన్నాగం..
ఆస్తి తమకు రాకుండా కుట్రపన్నుతున్న అత్తమామలను హతమార్చేందుకు కోడలు సిద్ధపడింది. ఇందులో భాగంగా కేసముద్రం స్టేషన్‌లోని తమ బట్టల దుకాణం పక్కనే టీస్టాల్ నడుపుకుంటు న్న మానుకోట మండలంలోని వేంనూర్కు చెం దిన మండల మోహన్‌తో పరిచయం పెంచుకుని అప్పుడప్పుడు డబ్బు ఇస్తూ వెళ్లింది. కాగా, మూ డు నెలల క్రితం అత్తామామలను హత్య చేయడంలో కలిసొస్తే రూ.2లక్షలు ఇస్తానని మోహన్‌కు చెప్పిన కవిత.. తన భర్తను దీనికి అంగీకరించేలా చేసింది. దీంతో మోహన్ మానుకోటలో రెండు కత్తులు చేయించి తన స్వగ్రామంలోని చెలకల వద్ద దాచాడు. అయితే కూనూరు లో ఉంటున్న వెంకట్రామయ్య, సరస్వతి సమ్మక్క పండుగ పెట్టుకుందామని ఈనెల 4న కొడుకుతో కలిసి కేసముద్రంలోని తన ఇంటికి వచ్చారు. అయితే అత్తామామలు వచ్చిన విషయాన్ని గమనించిన కవిత వెంటనే మోహన్‌కు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో చెలక లో దాచిపెట్టిన కత్తులను మోహన్ ఒక సంచిలో వేసుకుని ఈనెల 6న రాత్రి 11 గంటలకు బైక్‌పై కవిత, కృష్ణ ఇంటికి వచ్చాడు. అయితే రాత్రివేళ మూత్రవిసర్జనకు ఎలాగైన బయటకు వస్తారని, అప్పటివరకు మనం కాపలా కాయాలంటూ కవి త, మోహన్ కిందికి దిగి సందులో నక్కి ఉన్నా రు. ఈ సమయంలో కవిత భర్త కృష్ణ పైగదిలోనే ఉండి పరిస్థితిని గమనిస్తున్నాడు.
కత్తితో మామపై దాడి..
కాగా, అర్థరాత్రి సమయంలో వెంకట్రామయ్య ఇంటి వెనక ఉన్న తలుపులు తీసి మూత్రవిసర్జన కు బయటకు వచ్చాడు. గమనించిన కోడలు కవి త మామను కత్తితో కడుపులో పొడిచింది. ఇదే సమయంలో మోహన్ ఇంట్లో ఉన్న సరస్వతి మెడపై, చాతిలో పొడిచి హతమార్చాడు. కాగా, మామను పొడిచిన తర్వాత కవిత లోపలికి వచ్చింది. అయితే అప్పటికీ ప్రాణాలను బిగపట్టుకున్న వెంకట్రామయ్య లోపలికి ప్రవేశించి కేకలు వేస్తుండగా వారిద్దరు మళ్లీ కత్తితో పొడవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం వారు ఇంట్లో ఉన్న డ్యాక్యుమెంట్లను తీసుకుని అక్కడి నుండి పరారయ్యారు. కాగా, సాయంత్రం 3 గంటలకు విష్ణుతో ఆడుకోవడాని కి పక్కింటి పిల్లాడు రావడంతో విషయం బ యట పడగా... కోడలు, కొడుకు ఏమి తెలియనట్లు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఆస్తి తగాదాలున్న విష యం తెలుసుకున్న పోలీసులు కొడుకును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోడలును అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని ఒప్పుకుంది. ఈ మేరకు బుధవారం వేంనూర్‌లో మోహన్‌ను పోలీసులు పట్టుకుని రెండు కత్తులను, సెల్ఫోన్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై ఫణిదర్, రూరల్ ఎస్సై పవన్, ఎఎస్సై రాంజీనాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.