నాసా వెళ్లే విద్యార్థికి రూ.2 లక్షల సాయం..
సాక్షి, హైదరాబాద్: నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి కొంకటి ప్రశాంత్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల సాయం అందించింది. సిద్ధిపేట నియోజకవర్గంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్‌ను మే 18 నుంచి 22 వరకు అమెరికాలో జరిగే సదస్సుకు హాజరు కావాలని నాసా ఆహ్వానించింది.
అయితే విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం మంత్రి టి.హరీశ్‌రావు దృష్టికి రావడంతో ఆయన ప్రభుత్వం నుంచి రూ.2లక్షలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన చెక్కును ఆదివారం సెక్రటేరియట్లో ప్రశాంత్‌కు మంత్రి అందజేశారు.