పాక్ జైల్లో భారతీయ ఖైదీ మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ క్రిపల్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందినట్టు పాకిస్థాన్ అధికారులు ప్రకటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న క్రిపల్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే తుది శ్వాస విడిచినట్టు కోట్ లఖ్ పత్ జైలు అధికారులు తెలిపారు.
1991 ఫసియాబాద్ రైల్వే స్టేషన్ బాంబు పేలుళ్ల కేసులో క్రిపల్ దోషిగా, ఉగ్రవాదం, గూఢచర్యం కేసులో యావజ్జీవశిక్షను అనుభవస్తున్నారు. 2013లో ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న సరబ్ సింగ్ పై ఇద్దరు సహ ఖైదీలు దాడిచేయగా తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.