kottakota dayakar reddy
-
'నేడు సంచలన సంఘటనలు ఉంటాయి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ల ట్యాపింగ్ కేసులో మరో 48 గంటల్లో సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఒక ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు, కేంద్రంలో ఉంటున్న ఒక ముఖ్యనేత, అదే స్థాయి గల ఇంకో నేత...మొత్తం అయిదుగురి అరెస్ట్‌కు రంగం సిద్ధమైందన్నారు. ఎన్నటీఆర్ట్ ట్రస్ట్ భవన్లో నిన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ట్యాపింగ్ వ్యవహారంలో దొరికిన ఆధారాలన్నింటినీ కోర్టు ముందు పెడతామని పేర్కొన్నారు. కేసు బుక్ చేయడమే కాదని, జైలుకు కూడా పంపుతామన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులపై ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ దూకుడు పెంచింది. ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ నమోదు అయిన కేసుల దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర ముఖ్యనేతల ఫోన్ ట్యాపింగ్‌పై విజయవాడలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
సీతమ్మ వెనక తోడు‘నీడ’
ఆలోచన వారిది.. ఆచరణ వీరిది. డెరైక్షన్ వారిది.. యాక్షన్ వీరిది. వ్యూహం వారిది.. విజయం వీరిది. ఇలా రాజకీయాల్లో ప్రతినాయకుడి వెనక తోడు‘నీడ’గా ఎవరో ఒకరు ఉంటారు. వారు బయటికి కనిపించకపోయినా.. తెరవెనక చక్రం తిప్పుతుంటారు. ఇక భార్యాభర్తలు ఇద్దరు ప్రజాప్రతినిధులైనా.. దేవరకద్ర ఎమ్మెల్యే సీతమ్మ వెనక, ఆమె భర్త కొత్తకోట దయాకర్‌రెడ్డి ఈ జాబితాలోనే ఉన్నారు. రాజకీయాల్లో ఒకరికొకరు తోడునీడగా నడుస్తున్నారు. 2001కి ముందు గృహిణిగా ఉన్న సీతమ్మను అదే సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించారు దయాకర్‌రెడ్డి. ఆ తరువాత ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే తన భర్త స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని సీతమ్మ చాలా సందర్భాల్లో చెప్పారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సీతమ్మను పోటీచేయించి గెలిపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి సీతమ్మ రెండోసారి పోటీచేస్తున్నారు. ఈసారి కూడా భార్య గెలుపు కోసం భర్త అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల నామినేషన్ మొదలుకొని.. ప్రచారంలో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో దయాకర్‌రెడ్డి దిట్ట. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను తనదైనశైలిలో తిప్పికొట్టడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం.