‘సీత’ దర్శకుడికి బెదిరింపులు
సాక్షి, సిటీబ్యూరో: సోషల్ మీడియా ద్వారా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ వివాదాస్పద షార్ట్ఫిల్మ్ ‘సీత–ఐయామ్ నాట్ ఏ వర్జిన్’ చిత్ర దర్శకుడు పి.కౌశిక్బాబు మంగళవారం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. వెల్లూరి ప్రసన్నతో పాటు ఇంకా కొంత మంది తనను సోషల్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.