Kowdipally
-
రూ.30 లక్షల బిల్లులు రాక.. ఇన్చార్జ్ సర్పంచ్ భిక్షాటన
కౌడిపల్లి (నర్సాపూర్): గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఓ ఇన్చార్జి సర్పంచ్ భిక్షాటన చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో సోమవారం చోటు చేసుకుంది. వెల్మకన్న గ్రామ ఇన్చార్జ్ సర్పంచ్ కాజిపేట రాజేందర్ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, క్రీడాప్రాంగణం, పారిశుధ్యం పనులు, హరితహారం, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేశామని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే, ఇంత వరకు బిల్లులు రాలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో పంచాయతీ కారి్మకులతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. రెండున్నర నెలల క్రితం రూ.ఆరు లక్షలకు సంబంధించి ఎంబీలు పూర్తి చేయగా చెక్కులు ఇచ్చారని, అయినా డబ్బులు మాత్రం రాలేదని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు అడిగిన ఫ్రీజింగ్లో ఉందని, వచ్చాక ఇస్తామని చెబుతున్నారని అన్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై -
నా ఫ్రెండ్‌ను చదివించండి
కౌడిపల్లి(నర్సాపూర్): తాను చదువుకుం టోంది... తన స్నేహితురాలు మాత్రం చదువు మాని ఇంటివద్దే ఉంటోంది. అది ఆమెను బాధించింది. అందుకే ‘నా ఫ్రెండ్‌ను చదివించండి’ అంటూ పాఠశాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంది. మెదక్ జిల్లా మహ్మద్ నగర్‌గేట్ తండాకు చెందిన సంధ్య, కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే తరగతికి చెందిన ఆమె ఫ్రెండ్ నందిని నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. ఇటీవలే ఆమె స్కూల్ మానేసి ఇంటివద్దే ఉంటోంది. స్నేహితురాలు పాఠశాలకు రాకపోవ డం సంధ్యను బాధపెట్టింది. ఈ క్రమంలో పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెండ్లీ పంచాయత్, లింగ వివక్ష’ అవగాహన సదస్సులో విద్యార్థులు పలు సమస్యలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంధ్య ‘నా ఫ్రెండ్ నాకంటే బాగా చదువుతుంది. కానీ తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. నా ఫ్రెండ్‌ను చదివించండి’ అంటూ కోరింది. బాలిక అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అధికారులు.. నందినిని తప్పకుండా చదివిస్తామని హామీ ఇచ్చారు. -
వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి
కౌడిపల్లి (మెదక్) : అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిపై ఇసుక మాఫియా తమ ప్రతాపం చూపించింది. వీఆర్వోపై దాడి చేసి అతన్ని గాయపరిచారు. దీంతో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బండపోతుగల్ సమీపంలో మంజీర నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న వీఆర్వో ఎల్లయ్య ఇదేంటని ప్రశ్నించడంతో.. ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. దీంతో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
లారీ, ట్రాక్టర్ ఢీ: ఇద్దరి దుర్మరణం
కౌడిపల్లి, న్యూస్‌లైన్: గూడ్స్ లారీ, కలప ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన కౌడిపల్లి మండలం నాగ్సాన్పల్లి గేట్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ నాగార్జునగౌడ్ కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలం అందుగులపల్లి తండాకు చెందిన మలోత్ హరిచంద్ కలప వ్యాపారం చేస్తుంటాడు. కౌడిపల్లి మండలం అంతారం చెరువుకొమ్మ తండాకు చెందిన నెనావత్ పూల్య అతని వద్ద కూలి పనికి వెళ్లాడు. ఓ ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ వైపు కలపను తరలిస్తున్నారు. రాములు అనే వ్యక్తి ట్రాక్టర్‌ను నడిపిస్తుండగా హరిచంద్(30), పూల్య(45)లు ఇంజన్ మడ్గడ్పై చెరోవైపు కూర్చున్నారు. నాగ్సాన్పల్లిగేట్ సమీపంలోనికి రాగానే వెనుక నుంచి వచ్చిన గూడ్స్ లారీ ఢీకొంది. దీంతో ట్రాక్టర్ ఇంజన్ మడ్గ డ్‌పై కూర్చున్న హరిచంద్, పూల్యలు ఒక్కసారిగా కిందపడిపోయారు. హరిచంద్ తలపైనుంచి ట్రాక్టర్ టైరు వెల్లడంతో తల చితికిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పూల్యపైనుంచి లారీ వెల్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని పూల్యను 108 అంబులెన్స్‌లో నర్సాపూర్ ఆసుపత్రికి తరలించగా చికి త్స ప్రారంభించేలోపు మరణించాడు. హరిచంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి తరలిం చారు. ట్రాక్టర్ డ్రైవర్ బి.రాములు ప్రమా దం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. హరిచంద్ కుటుంబీకుల రాస్తారోకో.. కుటుంబ సభ్యులు వచ్చేలోపు హరిచంద్ మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తాము వచ్చేలోపు ఎందుకు తరలించారంటూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు నాగ్సాన్పల్లి వద్ద అరగంటపాటు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడికి చే రుకుని వారిని సముదాయించారు. ట్రాక్ట ర్ డ్రైవర్ రాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. రెండు తండాల్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో హరిచంద్, పూల్యలు మృతి చెందడంతో వెల్దుర్తి మండలం అందుగులపల్లి తండా, కౌడిపల్లి మండలం అంతారం చెరువుకొమ్మ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుగులపల్లి తండాకు చెందిన హరిచంద్‌కు తల్లిదండ్రులు గేని, రాములుతోపాటు భార్య బుజ్జి, ఇద్దరు కొడుకులున్నారు. ఇతనికి మూడు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. నెనావత్ పూల్య కూలి పనులు చేస్తుంటాడు. మొదటి భార్య కొమ్ని మరణించగా రెండో పెళ్లిచేసుకున్నాడు. పెద్ద భార్యకు ఓ కూతురు, చిన్న భార్యకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురుంది. కాగా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. ఎకరం భూమి ఉండగా మొక్కజొన్న వేసినా అధిక వర్షాలతో చేతికి రాకుండా పోవడంతో నష్టపోయాడు. దీంతో కూలి పనులకు వెళ్తున్నాడు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రెండు కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి మరిన్ని కష్టాల్లో కూరుకుపోయాయి. ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తండా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.