కడపలో ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
కడప నగరంలో ఇద్దరు చైన్ స్నాచర్లను వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు చైన్స్నాచర్లలో ఒకరు సీకే దిన్నె మండలానికి చెందిన కొత్తపల్లి కృష్ణాంజనేయులు కాగా..కడప నగరం నాగరాజుపేటకు చెందిన సాకె చంద్రశేఖర్ మరొకరు. వీరు నగరంలో జరిగిన 11 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులు. వీరి వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే 33 తులాల బంగారు ఆభరణాలను, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.