గీత స్మరణం
సాకీ : అతడు: గోపాలబాలకృష్ణ గోకులాష్టమి
ఆబాలగోపాల పుణ్యాల పున్నమి
ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని
నంద నందనుడు నడచిన చోటే... న వనందనవని
బృందం: గోపికా ప్రియ కృష్ణహరే
నమో కోమల హృదయ కృష్ణహరే
వేవేల రూపాల వేదహరే నమో వే దాంతవేద్యా కృష్ణహరే (2)
పల్లవి :
ఆమె: గోవిందుడే కోకచుట్టి గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేతబట్టి వచ్చెనమ్మా
॥
నవమోహన జీవన వరమిచ్చెనమ్మా
ఇకపై ఇంకెపుడూ నీ చేయి విడిచి వెళ్లనని
చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా
బృం: దేవకీ వసుదేవ పుత్రహరే
నమో పద్మపత్ర నేత్ర కృష్ణహరే
యదుకుల నందన కృష్ణహరే
నమో యశోద నందన కృష్ణహరే
॥
చరణం : 1
ఆ: ఎన్నాళ్లకు... ఎన్నాళ్లకు...
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు
వెన్నుడొచ్చెనమ్మా
ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చెనమ్మా
వెన్నపాలు ఆరగించి... విన్నపాలు మన్నించి (2)
వెండి వెన్నెల్లో ముద్దులిచ్చెనమ్మా
ఇద్దరు: కష్టాల కడలి పసిడి పడవాయెనమ్మా
కళ్యాణ రాగమురళి కలలు చిలికెనమ్మా
ఆ: మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా
అ: వసుధైక కుటుంబమని గీత చెప్పెనమ్మా
బృం: గోవర్ధనోద్ధార కృష్ణహరే
నమో గోపాల భూపాల కృష్ణహరే
గోవింద గోవింద కృష్ణహరే
నమో గోపికావల్లభ కృష్ణహరే
॥॥
చరణం : 2
ఆ: తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా
తన అడుగుల ముగ్గులు చూసి మురిసినాడమ్మా
అ: మన అడుగున అడుగేసి... మనతోనే చిందేసి (2)
మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా
కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా
కలకాల భాగ్యాలు కలిసొచ్చెనమ్మా
హరిపాదం లేనిచోటు మరుభూమేనమ్మా
ఆ: శ్రీపాదం ఉన్నచోట సిరులు విరియునమ్మా
బృం: ఆపదోద్ధారక కృష్ణహరే
నమో ఆనందవర్ధక కృష్ణహరే
లీలామానుష కృష్ణహరే
నమో గానవిలాస కృష్ణహరే
॥॥
చిత్రం : పాండురంగడు (2008)
రచన : శ్రీ వేదవ్యాస
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : మధుబాలకృష్ణన్, సునీత, కీరవాణి, బృందం