ఉప్పలపాటి అధ్యక్షతన టాంటెక్స్ నూతన కార్యవర్గం
డాలస్, ఫోర్ట్ వర్త్ :
తెలుగు సంస్కృతి, తెలుగు భాష కోసం అహర్నిషలు కృషి చేస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) 2017 సంవత్సరానికి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఇర్వింగ్లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో టాoటెక్స్ 2017 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. టాంటెక్స్ అధ్యక్షుడిగా ఉప్పలపాటి కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టాంటెక్స్ లాంటి సంస్థకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే టాంటెక్స్ అధ్యక్షడిగా పదవీ విరమణ చేసిన జొన్నల గడ్డ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఉప్పలపాటి కృష్ణారెడ్డి నేతృత్వంలోని కార్యవర్గ బృందానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
టాంటెక్స్ అధికారిక కార్యనిర్వాహక బృందం..
అధ్యక్షుడు : ఉప్పలపాటి కృష్ణారెడ్డి
సంయుక్త కార్యదర్శి : కోడూరు కృష్ణారెడ్డి
ఉత్తరాధ్యక్షులు: శీలం కృష్ణవేణి
కోశాధికారి : గోవాడ అజయ్
ఉపాధ్యక్షుడు : వీర్నపు చిన్న సత్యం
సంయుక్త కోశాధికారి : మండిగ శ్రీలక్ష్మీ
కార్యదర్శి : కాజ చంద్రశేఖర్
పాత అధ్యక్షుడు: జొన్నలగడ్డ సుబ్రమణ్యం
ఇతర సభ్యలు : ఆదిభట్ల మహేష్ ఆదిత్య, పాలేటి లక్ష్మీ, బిళ్ల ప్రవీణ్, సింగిరెడ్డి శారద, కొణిదల లోకేష్ నాయుడు, బ్రహ్మదేవర శేఖర్ రాజ్, పార్నపల్లి ఉమా మహేష్, పద్మశ్రీ తోట, తోపుదుర్తి ప్రబంధ్ రెడ్డి, కసగాని మనోహర్, లంక భాను, ఎర్రం శరత్, ఇల్లెందుల సమీర.
పాలక మండలి
అధిపతి : రొడ్డ రామకృష్ణా రెడ్డి,
ఉపాధిపతి : పావులూరి వేణుమాధవ్,
ఇతర సభ్యులు : డా. సిరిపిరెడ్డి రాఘవరెడ్డి, పుట్లూరు రమణ, రుమాళ్ల శ్యామ, కొనార రామ్, కన్నెగంటి చంద్రశేఖర్.