జూలై 31న 'యుద్ధం శరణం' టీజర్
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లో సినిమాలోని నటీనటులను పరిచయం చేసిన చిత్రయూనిట్, ఈ నెల 31న టీజర్ ను రిలీజ్ చేస్తోంది. చైతూ మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండటం విశేషం.
ఈ సినిమా టీజర్ రెగ్యులర్ టీజర్లలా కాకుండా కాస్త కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 31న టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన చైతన్య, మీ అందరికీ టీజర్ చూపించటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంటూ ట్వీట్ చేశాడు. కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.
Excited to show you guys this one ! #YuddhamSharanamTeaserOnJuly31 pic.twitter.com/4ws2RqjPbW
— chaitanya akkineni (@chay_akkineni) 27 July 2017